అన్యాయమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు..? టిజెఎస్ఎస్
ప్రజాస్వామ్య దేశంలో నిరంకుశ వైఖరి
అర్ధరాత్రి అరెస్టులు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం
టీజెఎస్ఎస్ అధ్యక్షులు అవంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అన్యాయమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని ప్రజాస్వామ్య దేశంలో పాలకుల నిరంకుశ వైఖరి విడనాడాలని టిజెఎస్ ఎస్ (తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ) అధ్యక్షులు ఆనంచిన్నీ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ గౌటి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఆనవాయితీ అయిందని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జర్నలిస్టులపై కక్ష సాధింపులు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలను ఎలాగో బొంద పెట్టేసారు ప్రజల పక్షాన ప్రశ్నించే జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్న పై అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికై నిత్యం ప్రజల మధ్య ఉండి పోరాడుతున్న తీన్మార్ మల్లన్న ఈ ప్రభుత్వం టార్గెట్గా చేసుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో లో జర్నలిస్టుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అంటూ కల్లబొల్లి మాటలు చెప్తూ జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అనుసరిస్తున్నారని దీనికి నిదర్శనమే తీన్మార్ మల్లన్న పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. జర్నలిస్టులకు నిధులు కేటాయిస్తున్నాం. జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నోటి తో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు గా ఉందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కేవలం జర్నలిస్టుల పైనే 700 పై కేసు నమోదు చేసిందంటే ఈ ప్రభుత్వం వైఖరి ఏమిటో అర్థం కావటం లేదన్నారు. నకిలీ జ్యోతిష్యుని బ్లాక్ మెయిల్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసిందని లేనిపోని ఆరోపణలు చేసి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమో తెలపాలన్నారు. లక్ష్మీకాంత్ శర్మ పై లైంగిక వేధింపు కేసులు ఉంటే అతన్ని అరెస్టు చేయకుండా ప్రశ్నించినందుకు తీన్మార్ మల్లన్న ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రజల మనిషి అని మల్లన్న కు వస్తున్న ప్రజాదరణ చూడలేక ప్రభుత్వం ఈర్ష్యతో పలు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు అన్నారు. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న పై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని అన్నంచిన్ని వెంకటేశ్వరరావు గౌటి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్తూపం వద్ద మౌన దీక్ష..
తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా సోమవారం ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద మౌన దీక్ష ఉంటుందని ప్రతి జర్నలిస్టు, తీన్మార్ మల్లన్న అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.