4477Main4

ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

 

తెలుగు రాష్ట్రాల ప్రజల ఎదురు చూపు ఫలించింది. ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించింది.. అయితే కొన్ని కండీషన్లు పెట్టింది. సీసీఆర్ఎఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

నెల్లూరు (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు  పంపిణీ చేయచవచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ లేదని తేలింది.

ఆనందయ్య వేసే మందుకు అనుమతి ఇస్తునే ఏపీ ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది. ఆనందయ్య కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతిని నిరాకరించింది. కంట్లో వేసే మందుకు సీసీఆర్ఏఎస్ ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఆనందయ్య కంట్లో వేసే ముందుకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక వేరే కారణముందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోట మండ‌లం తిన్నెలపొడికి చెందిన కోట‌య్య అనే రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్‌.. ఆనందయ్య దగ్గర కంట్లో చుక్కలు వేసుకుని బ్రతికానన్న వీడియోతో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారిపోయింది.. కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కోటయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జిజిహెచ్ కి త‌ర‌లించారు. వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో ఇవాళ మ‌ర‌ణించారు కోటయ్య. దీంతో కంట్లో వేసే మందుకు అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఏపీలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సమావేశంలోనూ ఆనందయ్య మందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీసీఆర్ఎఎస్ నివేదిక ఆధారంగా అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.. అయితే కంట్లో మందు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఓ విజ్ఞప్తి చేసింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని కోరింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని, అయితే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రోగులకు బుదులు వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి మందును తీసుకెళ్తే కొవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశించింది.సీసీఆర్ఎఎస్ పూర్తి నివేదిక ఇవ్వడానికి మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర లక్షాలు లేవని.. కనీసం ఇమ్యునిటీ బూస్టర్లుగా అయినా ఆయన మందు వాడొచ్చని నివేదిక చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఆయనది ఆయుర్వేద ముందు కాదనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరికొంత అధ్యయనం తరువాత దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.