ఆప్ఘన్ నుంచి వచ్చే వారికి ఫ్రీ పోలియో వాక్సిన్..
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలు కొనసాగుతోన్నాయి. వారి దుశ్చర్యతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ గల ప్రజలు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే ఆప్ఘన్ నుంచి వచ్చే ప్రజలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ తీపి కబురు తెలియజేసింది. ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తామని పేర్కొన్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవియ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో డ్రైవ్ జరుగుతుందని ఆయన వివరించారు. ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి పోలియో వ్యాక్సిన్ ఎందుకు అనే అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. 2014 మార్చి 27వ తేదీ నుంచి భారత్ పోలియో రహిత దేశంగా మారిందని చెప్పారు. ఆగ్నేయాసియాలో భారత్ పోలియో ప్రీ కంట్రీగా మారిందని చెప్పారు. కానీ ఇటీవల పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లో పోలియో కేసులు వెలుగుచూశాయని చెప్పారు. అందుకే ఆ దేశాల నుంచి వచ్చేవారికి పోలియో వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని వివరించారు. పోలియో నిర్మూలన కోసం తగిన చర్యలు తీసుకోకుంటే ముప్పు పొంచి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఏడాదికి 2 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పోలియోలో మూడు రకాల ఉంటాయని తెలిపారు. పోలియో తీవ్రత ఎక్కువ ఉన్న దానిలో వేగంగా వ్యాపిస్తోందని వివరించారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.