jagan

 

ఆరోగ్యశ్రీ ఆల్‌ టైం రికార్డ్

 

🔹పేదల వైద్యానికి వేల కోట్లు
🔹జగన్ సర్కార్ ఘనత

 

అమరావతి (ప్రశ్న న్యూస్) పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవాలి. ఎన్నడూ పెద్దాస్పత్రులకు వెళ్లలేని నిరుపేదలను సైతం నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కించింది ఆరోగ్యశ్రీ. ఎందరో పేదలు గుండె ఆపరేషన్లు, ఇతర ప్రమాదకర జబ్బులకు మెరుగైన వైద్య సేవలు అందుకున్నారంటే ఈ పథకం పుణ్యమే. ఆగిపోవాల్సిన గుండెని లక్షలు ఖర్చు చేసి తిరిగి మళ్లీ కొట్టుకునేలా చేసి.. పునర్జన్మ ప్రసాదించారంటూ ఇప్పటికే ఎంతోమంది తమ అనుభవాలను గొప్పగా చెప్పుకున్న సందర్భాలెన్నో.! అలాంటి మహత్తర పథకం వైఎస్ తనయుడు సీఎం జగన్ పాలనలో మరో మైలురాయి సాధించింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి పరిశీలిస్తే ఈ రెండేళ్లలోనే సుమారు 34 శాతం మంది.. అంటే సుమారు 11.79 లక్షల మందికి పైగా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్యం పొందారని వైసీసీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఇది ఆరోగ్య శ్రీ పథకం ఆల్ టైం రికార్డ్ అని ఆయన తెలియజేశారు. పేదల ఆరోగ్యం కోసం జగన్ ప్రభుత్వం రూ.4,244 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.