revanth reddy

 

ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా..

 

సీఎం కేసిఆర్ దత్తత గ్రామంలో రేవంత్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష ముగిసింది.. ఈ సంధర్బంగా రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తాను అభివృద్దిపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.

 

మూడు చింతలపల్లి (ప్రశ్న న్యూస్) మేడ్చల్ మల్కజ్‌గిరి జిల్లాలోని సీఎం కేసిఆర్ దత్తత గ్రామమైన మూడు చింతల పల్లిలో చేపట్టిన 48 గంటల దీక్ష ముగిసిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ తోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.. దీక్ష చేపట్టిన మూడు చింతల పల్లిలో సీఎం కేసిఆర్ దత్తత తీసుకున్నా ఎలాంటీ అభివృద్ది జరగలేదని అన్నారు.. సీఎం కేసిఆర్ ఫాం హౌజ్ వెళ్లేందుకు రోడ్డు వేసుకోవడం తప్ప ఎలాంటీ అభివృద్ది కార్యక్రమాలు చేయలేదని మండిపడ్డారు.. కాగా ఇటివల సీఎం కేసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక దీక్ష చేపట్టిన మూడు చింతలపల్లి అభివృద్దితో పాటు దళితుల అభివృద్ది కోసం అవసరమైతే నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంతోపాటు అసెంబ్లీని కూడా అమ్మెద్దామని అన్నారు. ముఖ్యంగా ఓటమి భయంతోనే సీఎం కేసిఆర్ అనేక హామీలు ఇస్తున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసిఆర్ కు తొలిసారి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఆయన హామీల వర్షం కురిపిస్తున్నాడని చెప్పాడు. సీఎం కేసిఆర్‌కు 20 నెలల ముందే భయం పట్టుకోవడం కాంగ్రేస్ పార్టీ సాధించిన విజయమని అన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసిఆర్ పక్కన కూర్చేనేందుకు కూడా ఎవ్వరు కూర్చునేందుకు కూడా సహాసించడం లేదని విమర్శించారు.ఇక సమావేశం తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చేందుకు సీఎం కేసిఆర్ భయపడ్డారని దుయ్యబట్టారు.. అందుకే మంత్రి కేటిఆర్ మీడియా ముందుకు వచ్చాడని ఎద్దెవా చేశారు.మూడు చింతల పల్లి ముగింపు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ మూడు చింతల పల్లిలో ఇచ్చిన హామీలు జరిగాయని నిరూపిస్తే తాను రాజీనామా చేసి ముక్కు భూమికి రాస్తానని అన్నారు. ఇక దళిత బంధు కోసం చేపట్టిన పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం ఇచ్చినప్పుడే తన పోరాటం ఆగుతుందని అన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన నిలబడుతుందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం కూడా దళిత గిరిజన అభివృద్ది, సంక్షేమం కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించే ఫైల్ పై సంతకం చేస్తానని హామి ఇచ్చారు.తనకు పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, ఆ తర్వాత ఎవ్వరు సీఎం అయినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.