ఆ గ్రామంలో పట్టాలున్నా.. రైతుబంధు సున్నా

ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులెవరూ రైతుబంధు డబ్బు చూడలేదు. రైతు బీమా గురించి వారికి తెలియదు. రైతులందరూ పట్టాభూములను కలిగి ఉండి పాత పాస్‌బుక్కులున్నా, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వలేదు. దీంతో రైతుబంధు డబ్బులు పడటం లేదంటూ అధికారులు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి.

 

సంగారెడ్డి (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు పెద్ద పీఠం వేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగు కోసం రైతుబంధు పథకం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ గ్రామానికి మాత్రం రైతుబంధు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నాగిరెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో రైతులు ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు చూడలేదు. రైతు భీమా గురించి తెలియదు. రైతుల పేర్ల మీద భూమి ఉన్నా రైతులు మాత్రం భూమి లేనట్టే అంటున్నారు. పాత పట్టా పాస్ బుక్కులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త బుక్కులు రాకపోవడంతో వారికి రైతుబంధు పడటం లేదు. గుమ్మడిదల మండలం నాగిరెడ్డిపేట గూడెం మొత్తం జనాభా 200 మంది రైతులు ఉన్నారు. ఇక్కడ భూమి మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి ఉంది.  నాగిరెడ్డి గూడెం లో గ్రామపంచాయతీ పరిధిలో 200 మంది రైతులు ఉన్నారు. వీరందరూ 272/1 నుంచి 272/1 ఈ సర్వే నంబర్లలో 336 పట్టా భూములు కలిగి ఉన్నాయి. ఇందులో 331 ఖుష్కి భూమిక ఏడు ఎకరాలు మాత్రమే తరి భూమి ఉన్నది. దశాబ్దాల కాలం నుండి గ్రామ రైతులు సాగు చేసుకుంటున్నారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగిరెడ్డి గూడెం రైతులందరికీ పట్టా పాస్బుక్కులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదేళ్ల కిందట భూప్రక్షాళన నిర్వహించింది. దీంతో నాగిరెడ్డి పేట గూడెం రైతులకు ప్రయోజనం కలగలేదు. భూప్రక్షాళనలో అధికారులు గ్రామాల వారీగా రైతుల భూములు సరిగా ఉన్నాయా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించారు. ఆ సమయంలో గ్రామంలో రైతుల పంట భూములు రెవెన్యూ రికార్డు ప్రకారం లేవని.. కొందరు భూములు తక్కువగా మరికొంత మంది రైతుల భూములు ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్నందున రెవెన్యూ అధికారులు పార్టు బీలో చేర్చారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి కష్టాలు మొదలయ్యాయి.

నాలుగేళ్లుగా అందని సాయం..

అధికారులు ఆ గ్రామ రైతుల భూములను పార్ట్‌-బీలో చేర్చి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఆ భూములు తమవేనంటూ రైతులు నిరూపించుకోవాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పాస్‌బుక్కులను తీసుకుని కొత్త పాస్‌ బుక్కులను ఇవ్వాలని రైతుల నాలుగేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. నాగిరెడ్డిపేట గూడెం రైతులకు ఫలితం లేకుండా పోయింది. 2018లో రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పాస్‌బుక్కులు ఇచ్చింది. కానీ ప్రభుత్వం నాగిరెడ్డిగూడెం గ్రామ రైతులకు మాత్రం ఇవ్వలేదు. పార్ట్‌-బీ నుంచి ఈ భూముల సర్వే నంబర్లను తొలగిస్తే తప్ప కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేమని నాలుగేళ్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొత్త పాస్‌బుక్కులు లేని కారణంగా 2018 ఖరీఫ్‌ సీజన్‌లో మొదలైన రైతుబంధును నాలుగేళ్లవుతున్నా ఈ గ్రామ రైతులకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. కొత్త పాస్ బుక్కులు ఇప్పించ తమకు రైతుబంధు డబ్బులు ఇప్పించాల్సిందిగా రైతులు కోరుతున్నారు.