ఎన్నాళ్లీ వివక్ష – మంత్రి కేటీఆర్
11 రాష్ట్రాల్లో అమలవుతున్న రైతు బంధు
75 ఏళ్ల నుంచి ఇంతే
బీజేపీ దరఖాస్తులకు ఆహ్వానం పై సెటైర్లు
సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న 17 లక్షల కుటుంబాలు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) దళిత బంధు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. విపక్షాలు అప్పుడే పెదవి విరిచాయి. కేసీఆర్ సర్కార్‌కు దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని అడిగారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దళిత బంధు.. ఇతర పథకాల గురించి ప్రస్తావించారు. ఇటు బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమం గురించి కూడా రియాక్ట్ అయ్యారు. మోడీ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పటికే నగదు, ఉద్యోగాలు ఇవ్వలేదని దెప్పి పొడిచారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ తమకు ముఖ్యం అని చెప్పారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌ను తెలంగాణ అధిగమించిందని వివరించారు. దళిత బంధుపై నానాయాగీ చేస్తున్నారని..రైతుబంధు పెట్టినప్పుడు కూడా ఇలానే అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు అదే రైతుబంధును 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. రైతుబంధు వచ్చాక రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు అని చెప్పారు. కానీ పైకి మాత్రం ఆరోపణలు చేయాలి కాబట్టి.. కామెంట్స్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో దళితులు వివక్షకు గురవుతున్నారని వివరించారు. దళితబంధుతో దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వాడొద్దంటున్న కేంద్రం ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. అలా చూపకపోగా.. పైగా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. గతేడాది 20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్న కేంద్రం ప్రభుత్వం.. అవి ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఇటు బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోడీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని కోరారు. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయని సెటైర్ వేశారు. ప్రజల ఖాతాల్లోకి నగదు రాలేదని కేటీఆర్ వ్యంగ్యంగా చెప్పారు. ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తామని కూడా మోడీ చెప్పారు. కానీ అవన్నీ ఆచరణ సాధ్యం కావడం లేదు.
ప్రభుత్వ దళిత ఉద్యోగులకు దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని నిన్న లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో డబ్బులు అందజేస్తామన్నారు. హుజూరాబాద్ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలన్నారు. 25 ఏళ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ప్రారంభించామని వివరించారు. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాటలు రూపొందించామని చెప్పారు. గత 25 ఏళ్ల నుంచి తన మెదడులో ఉందన్నారు. ప్రపంచంలో అణగారిన జాతులు ఎన్నో ఉన్నాయని వివరించారు. దేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయని చెప్పారు. అంబేద్కర్ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయని సీఎం అన్నారు. ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలన్నారు. తెలంగాణ నుంచి చేసే పని దేశమంతా వ్యాపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చేస్తామంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. రెండు నెలల్లో హుజూరాబాద్‌లో పథకం అమలవుతుందన్నారు. మిగతా నియోజకవర్గాల్లో హుజూరాబాద్ దళితులే ఆదర్శం కావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. రైతుబంధు తరహాలోనే దళిత బంధు వస్తోందని చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగులైన దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఒకరికీ 4 ఎకరాల భూమి ఉంటే రైతుబంధు వస్తుందని…. రైతుబంధు లాగే దళిత బంధు వర్తిస్తుందని చెప్పారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివరి వరుసలో ఉండి తీసుకోవాలన్నారు. దళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయని వివరించారు. అలాంటి వారికి తొలి వరుసలో ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చుకుంటూ పోతామని.. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇచ్చే హామీ తనదన్నారు. రెండు పూటలు పస్తులుండే వాళ్లు లక్షల మంది ఉన్నారని.. వారు ముందుగా తీసుకోవాలని కోరారు. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలేనని చెప్పారు. 75 లక్షల జనాభా ఉందని.. అతి తక్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలేనని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం.. అయితే ప్రజలు ప్రభువులు అయితే దళితులు ఎందుకు ప్రభువులుగా లేరని ప్రశ్నించారు. ఈ వివక్ష ఎన్ని శతబ్దాలు కొనసాగాలని. ఇది సరికాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇవాళ కేటీఆర్ కూడా దళితుల వివక్ష గురించి కామెంట్ చేశారు.