jg

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

🔹28 రోజుల్లోనే సెకెండ్ డోస్

సెకెండ్ డోస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొవిషీల్డ్ రెండో డోస్ ను 84 రోజుల తరువాతే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం 28 రోజుల్లోనే సెకెండ్ డోస్ వేయాలని నిర్ణయించింది.

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే భారీగా ఏపీకి డోసులు చేరుకున్నాయి. మరికొన్ని రావాల్సి ఉంది. మొన్నటి వరకు ఏపీ వ్యాప్తంగా కేవలం సెకెండ్ డోస్ మాత్రమే పంపిణీ చేశారు. తాజాగా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం కోవిషీల్డ్ సెకెండ్ డోస్ తీసుకోవాలి అంటే.. తొలి డోస్ నుంచి రెండో డోస్ కు కనీసం 84 రోజుల గ్యాప్ ఉండాలి. కోవిషీల్డ్ తీసుకున్న వారికి కనీసం 84 రోజుల గ్యాప్ లేనిదే ఎక్కడా సెకెండ్ డోస్ వేయడం లేదు. ఆ విషయం తెలియక వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లినా.. ఇంకా 84 రోజులు పూర్తి కాలేదని చెప్పి వెనక్కు పంపించేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే నిబంధన అమలవుతోంది. కానీ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.కానీ కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్‌ రెండో డోసును 84 రోజుల తర్వాత పొందాలి. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం విదాస్పదంగా మారుతోంది. అత్యవసరం అన్నవాళ్లకు కూడా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సెకెండ్ డోస్ వేయడం లేదని.. అసలు 84 రోజుల లోపు వ్యాక్సిన్ వేసినా.. అది పని చేయదంటూ కొందరు ప్రచారం చేశారని.. ఇప్పుడు 28 రోజుల్లోనే సెకెండ్ డోస్ వేస్తారని ఎలా చెబుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం వ్యాక్సినేషన్, కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తోంది. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా తీవ్రత బాగా తగ్గు ముఖం పట్టింది. గత 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 6 వేల 952 కేసులు న‌మోద‌య్యాయి. మరణాలు కూడా కాస్త తగ్గాయనే చెప్పాలి. వారం రోజుల కిందటి వరకు ప్రతి రోజూ వంద మంది మరణిస్తున్నట్టు బులిటిన్ వచ్చేంది. తా మ‌రో 58 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది.అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు వెలుగుచూశాయి. కొత్త‌గా కరోనాతో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు.ఏపీలో కరోనా కేసులు.. మరణాలు తగ్గడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియే కారణమంటున్నారు వైద్య నిపుణులు, అధికారులు.. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగం చేయాలని నిర్ణయించారు.