ఏపీ ప్రభుత్వ, పింఛనుదారులకు జగన్ సర్కారు గుడ్‌న్యూస్
డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర కరవు భత్యం(డీఏ) పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెరుగుదలతో ఉద్యోగి మూల వేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెరిగినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 2019 జనవరి 1వ తేదీ నుంచి డీఏ పెంపుదల ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయకాంగ్, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికీ డీఏ పెంపుదల వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. 2021 జులై నెల వేతనంతో పెంచిన కరవు భత్యాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2019, జనవరి 1వ తేదీ నుంచి డీఏ బకాయిలను వాయిదాల్లో జులై 2021 నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఏపీలోని పింఛనుదారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆర్థిక ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను 2019, జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో పింఛనుదారుల డీఏ 33.536 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Related posts:
రాష్ట్రంలో నిరంకుశ పాలనా
కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం - కేసీఆర్
ఈటలపై స్వరం పెంచిన టీఆర్ఎస్ అగ్రనేతలు
విద్యుత్ కొరత పై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్..
అక్టోబర్ నుంచి మిగులు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులు, విరాళాలు
జోరు వానలో హోరెత్తించిన రేవంత్
జగన్ - కేసీఆర్ ఇద్దరూ సన్నిహితులే
ఇప్పటి వరకు ఒక లెక్క...ఇక నుండి మరో లెక్క...