PrajaPrashna

Telugu Daily Newspaper

కన్య (Virgo)

Virgo(Kanya)

కన్య (Virgo)

 

ఉత్తర 2,3,4,పా॥ హస్త 4 పా॥లు చిత్త 1,2, పా॥లు :- ఆదాయం 14 ఖర్చు – 2; రాజపూజ్యం-6 అవమానం

 

గురుడు: ఈ సంవత్సరమంతయు షష్ఠ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు పంచమమందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి భాగ్య మందు, కేతువు తృతీయ మందు సంచరించును.

ఈ రాశివారికి గురు, శని, రాహు బలము ఈ సంవత్సరమంతయు లేనందున సామాన్య ఫలితములు కలుగును. అకామార్జన వైపు ఆలోచనలు చేయుట, చొరత్వ బుద్ధి, పుత్ర మూలకముగా ఇబ్బందులు, దాయాదులతో వాజ్యములు అధికముగా పెరుగుట, ఋణబాధలు, రోగబాధలు, స్థానచలన సూచనలు, ధననష్టం. ఆనారోగ్యం, వివాహాది శుభకార్యములు ఆలస్యమగుట, అనవసర ప్రయాణాలు, శరీరము దుఃఖము పొందుట, బంధుమిత్రులతో వైరము, తోటివారితో అనవసర వివాదములు కలుగును, దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది, చిత్త చాంచల్యం వలన ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు, భార్యాపిల్లలకు దూరంగా ఉండవలసి వచ్చును, గృహము విడిచి గ్రామాంతరము వెళ్ళినచో సుఖము కలుగుతుంది, అనవసర వాగ్వివాదములు చేయుట వలన శత్రువృద్ధి కలుగును, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు చేయుట , వైరాగ్యమందు ఇష్టము కలిగి ఉందురు, చిత్రమయినటువంటి అనారోగ్యము కలుగును. కుటుంబ పోషణ నిమిత్తము దూరంగా వెళ్ళవలసి వచ్చును, ప్రతి పనియందు అనుకోని విధంగా ఇబ్బందులు వచ్చును, శ్రమకు తగ్గ ఫలితం రాక ఇబ్బందులు పడతారు, ఇతరులకు సహాయము చేసినా వారి నుండి కృతజ్ఞతాభావం దొరకక మనసుకి కష్టం కలిగించును, భాగస్వామి పట్ల నిర్లక్ష్య ధోరణి, సుఖము తగ్గుట, ఉద్యోగము నందు చిక్కులు కలుగును. విద్యార్థులు ఉత్తీర్ణులగుటకు శ్రమించవలయును. ఉపాధ్యాయులకు అధికారుల వత్తిడి, స్థానచలనము, వ్యవసాయదారులకు పంట నష్టము, కోళ్ల పరిశ్రమ, మత్స్య, పైనాన్స్ వ్యాపారులు నష్టాలు చవిచూడవలసి వచ్చును, రాజకీయ నాయకులకు ప్రజల నుండి వ్యతిరేకత వచ్చును, కళాకారులు తగిన ప్రోత్సాహముండదు, అన్ని రంగముల వారు నష్టాలను చవిచూడవలసి వచ్చును.

ఈ రాశివారు శివాభిషేకము చేయించుట, శివస్తోత్ర పారాయణం, శనివార నియమం ఆచరించుట, చండీ పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణలు, సుబ్రహ్మణ్యపూజ చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : ఋణములు చేయవలసి వచ్చుట, దేశ దిమ్మరితనము, కళత్ర అనారోగ్యం, చేతికి బాకీలు వసూలుగాక ఇబ్బంది పడుట, అధికారుల వలన లాభము, ఉపయోగము లేని పదవి వచ్చుట, సంఘమునందు గౌరవము కలుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : ప్రాణాపాయం, ద్రవ్యనాశనము, ప్రమాదములు, చోరుల వలన ఇబ్బందులు, జూదం వలన నష్టము, తీవ్ర అనారోగ్యము, చంచల స్వభావము కలుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఈ మాసము అన్నివిధములుగా లాభము చేకూర్చును, ప్రభుత్వ సహాయసహకారములు, అధికార పదవి, మానసిక ప్రశాంతత, భాగస్వామితో సరస సల్లాపము, సంతాన రీత్యా కీర్తి, సుఖము, అందరి మన్నలను పొందుట, చక్కని ఆరోగ్యము, దైవ అనుకూలము కలుగును.

ఆషాఢ మాసం (11th July to 8th August) : అన్ని విషయములు అనుకూలించును. ధనలాభము, అధికారుల ప్రశంశలు, ఉద్యోగాభివృద్ధి, సోదరుల సహాయ సహకారములు, అధిక ఖర్చు, అధిక శ్రమ, సమయస్ఫూర్తి,శుభవార్త వినుట, నూతన వృత్తి వ్యాపారాలు పెట్టుబడులు లాభించును.

శ్రావణ మాసము (9th August to 7th September) : అనారోగ్యములు, సౌఖ్యము తగ్గుట, వ్యాధుల వలన తాపము, నేత్ర పీడ, ఋణములు చేయుట, సోమరితనము, నీచ కార్యములకు పాల్పడుట, అధిక ధనవ్యయము, పశ్చాతాపము, మిత్రుల వలన నష్టపోవుట, సరియైన ఆలోచనలు చేయలేక ఇబ్బందిపడుట జరుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : నీచపు ఆలోచనలు, శిరోవ్యధ, పేగులయందు రోగము, చోర, అగ్ని భయము, ధన నష్టము, అనారోగ్యముచే ఔషధ సేవ చేయుట, వృత్తి వ్యాపారములు కలసిరాకపోవుట, దుష్ట మిత్ర సహవాసముచే చెడు పనులకు ప్రేరేపింపబడుట, విలాసముల కొరకు ధనము ఖర్చు చేయుట జరుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : ఈ మాసము గ్రహ బలము తక్కువగా ఉన్నది. విలాస వస్తువుల కొరకు ధనం ఖర్చు చేస్తారు, శ్రద్ధ వహించుట అవసరం. కంటి జబ్బులు,తప్పు ప్రతిపాదనలు, వంచన, వ్యాపారనష్టము, భాగస్వామితో విరోధము,మానసిక అశాంతి, ప్రభుత్వము నుండి చిక్కులు, బంధువులతో కలహములు కలుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : విందులు వినోదములలో పాల్గొంటారు, నూతన ఉద్యోగ ప్రయత్నం ఫలించును.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : వ్యాపారులకు లాభదాయకంగా ఉండును, ధనాదాయం బాగుండును, గృహ వాతావరణం అనుకూలం, శుభకార్య యోచన. బంధు మిత్రుల సమాగమము, విందు వినోదాల్లో పాల్గొంటారు, ధనము ఖర్చు చేస్తారు, ఆరోగ్యం బాగుండును.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : కళత్ర సౌఖ్యము తగ్గుట, కళత్ర పీడ, మానసికంగా సామాన్య స్థితి, ఆందోళన, అందరితో కలహములు, వృత్తి వ్యాపారములు మధ్యమము, సంతానరీత్యా చిక్కులు కలుగును.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : వృధా ఖర్చులు, కొద్దిపాటి అనారోగ్యము, వైద్యుని సంప్రదించవలసి వచ్చుట, దైవ దర్శనములు చేయుట, బంధువుల మరణ వార్త వినవలసి వచ్చుట, అధికారుల నుండి చిక్కులు, అవమానము పొందుట జరుగును.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : ఈ మాసంలో శుభకార్యములు చేయుట, గృహమునందు మంగళ తోరణములు కట్టుట, ఋణములు చేయుట, చక్కని ఆదాయము, అనారోగ్యం నుండి ఉపశాంతి, ధైర్యము, లాభము కలుగును.