కరోనాపై కోవాగ్జిన్ సమర్థత @ 77.8 శాతం
🔹కేవలం 0.5శాతం మందిలో దుష్ప్రభావాలు
🔹ప్రస్తుతం 16 దేశాల్లో అందుబాటు
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై 63.6శాతం సమర్థంగా,కోవిడ్ తీవ్ర లక్షణాలు ఉన్నవారిలో 93.4శాతం సమర్థంగా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు తెలిపింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను భారత్ బయోటెక్ శనివారం(జులై 3) వెల్లడించింది. మొత్తం 130 మంది సింప్టమాటిక్ కోవిడ్ పేషెంట్లపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ డేటాను నిర్దారించారు. ‘కోవాగ్జిన్ ద్వారా శాస్త్రీయ విశ్వాసాన్ని చూరగొని… సరైన సామర్థ్యం,నిబద్ధతతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలుపుతున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఇన్నోవేషన్, క్లినికల్ రీసెర్చ్, డేటా, సేఫ్టీ, సమర్థత వంటి అంశాల్లో 10 ప్రపంచ స్థాయి ప్రచురణల్లో కోవాగ్జిన్ చోటు సంపాదించుకుంది. ఇందుకు సహకారం అందించినవారికి ధన్యవాదాలు.’ అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు.
18-98 ఏళ్ల వయసున్న 130 మంది సింప్టమాటిక్ కోవిడ్ పేషెంట్లపై భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. భారత్‌లోని 25 ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 12 శాతం మందిలో సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించగా 0.5శాతం మందిలో తీవ్ర దుష్ప్రభావాన్ని గమనించారు. ఇతర కోవిడ్ వ్యాక్సిన్లతో పోల్చితే కోవాగ్జిన్ వల్ల కలిగే దుష్ప్రభావం చాలా తక్కువ అని తెలిపారు. సమర్థత,సామర్థ్యం,రక్షణ విషయంలో క్లినికల్ ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సాధించిన ఫలితాలతో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని… అభివృద్ది చెందిన దేశాలు సైతం మనవైపు చూస్తున్నాయని భారత్ బయోటెక్ మేనేజర్ డా.కృష్ణా ఎల్లా పేర్కొన్నారు.ప్రస్తుతం భారత్,బ్రెజిల్,ఫిలిప్పీన్స్,
కోవాగ్జిన్ తయారీలో కోవిడ్ 19 వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 క్రియా రహిత వైరస్‌ను ఉపయోగించి వ్యాక్సిన్ అభివృద్ది చేస్తారు.వ్యాక్సిన్ ద్వారా దాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా రోగనిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అయితే ఆ క్రియా రహిత వైరస్‌ను వ్యాక్సిన్‌లో ఉపయోగించాలంటే, ప్రయోగశాలలో దాన్ని అభివృద్ది చేయాల్సి ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి కణజాలాలలో ఉండే స్థితిని పున:సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ల పెరుగుదలకు ల్యాబ్‌లో అనువైన పరిస్థితులను కల్పిస్తారు. అదే సమయంలో వైరస్ అభివృద్దికి అవసరమయ్యే పోషకాలను అందించడానికి ఆవులు,గుర్రాలు,మేకలు,గొర్రెలు లేదా ఇతర జంతువుల నుంచి సేకరించిన కణజాలాన్ని ఉపయోగిస్తారు.