కరోనా కష్టకాలంలో కూడా ..రాష్ట్రంలో మెరుగైన అభివృద్ది
ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధ నాయకత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం… అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు వెళుతోందని….. ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు.. హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీశాఖల వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్… కొవిడ్ సమయంలో కూడా దేశ సగటును మించి అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరోనా లాంటీ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మంచిప్రగతి సాధించామని మంత్రి కేటిఆర్ వివరించారు. దేశంలో తలసరి ఆదాయం లక్ష 27వేల 768గా ఉంటే… రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 27వేల 145 గా ఉందని అన్నారు.. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని,ఇది జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ సంధర్భంగా మల్టినేషనల్ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వవిధానాలు నచ్చి ఒకసారి పెట్టుబడిన వారిలో 80 శాతం మరోసారి పెట్టుబడులు పెడుతున్నారని గుర్తుచేశారు. ఇక ద్వితీయ శ్రేణి నగరాలకు శరవేగంగా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీటవర్స్ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపిన కేటిఆర్… త్వరలో మరో మూడు జిల్లాల్లో ఐటీ టవర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. . ఎలక్ట్రానిక్ రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఈ సంధర్బంగా గుర్తు చేశారు… త్వరలో మహబూబ్‌నగర్ జిల్లా దివిటి ప్రాంతంలో సోలార్ పార్క్ ప్రారంభించనున్నట్లు వివరించారు.
టీహబ్ రెండోదశను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. మరోవైపు వైద్యరంగానికి హైదారాబాద్‌ను హబ్‌గా తీర్చిదిద్ధడంలో… ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేటీఆర్ వివరించారు. జినోమ్ వ్యాలీలోని పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఫార్మాసిటీని ప్రారంభించనున్నట్లు కేటీఆర్ చెప్పారు.. కొవిడ్ వల్ల ఎన్నోరంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేసిన కేటీఆర్…. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు వారికి అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. అందులో భాగంగా వివిధ రకాల రాయితీలు అందించినట్లు తెలిపారు. ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అన్నిరంగాల్లో సమతుల్య అభివృద్ధి సాధిస్తున్న అరుదైన రాష్ట్రం.. తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ అన్నారు.