PrajaPrashna

Telugu Daily Newspaper

కర్కాటకం (Cancer)

Cancer(Karkataka)

కర్కాటకం (Cancer)

 

పునర్వసు 4పా|| పుష్యమి 4పా, ఆశ్లేష 4 పా|| :- ఆదాయం – 8 ఖర్చు – 2; రాజపూజ్యత – 7 అవమానం – 3

 

గురుడు: ఈ సంవత్సరమంతయు అష్టమ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు సప్తమ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి ఏకాదశ మందు, కేతువు పంచమ మందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. దూరాలోచన లేకపోవుట వలన ధనము వృధాగా ఖర్చు అగును. ఇతర విషయములలో అనవసర జోక్యము, సమయమునకు తగిన ఆలోచన లోపించుట, అధిక ప్రసంగములు, కృషికి తగిన ప్రతిఫలము పొందలేకపోవుట జరుగును. అధిక ధనవ్యయములు తగ్గించుట మంచిది. ఆరోగ్య విషయములపై శ్రద్ధ వహించక పోవుట, వేళ దాటి నిద్ర,నిద్ర రాక ఇబ్బంది పడుట,ఎల్లపుడు ఏదో ఒక సమస్య కలుగుట, గృహములో శుభకార్యాలు చేయుట, కుటుంబములో ఆరోగ్య భంగములు కలుగుట, దుష్ట స్త్రీలతో కలసి సంపద లోబరచుకొను ప్రయత్నములు చేయుట, పర ధన ప్రాప్తి కలుగును. దొంగల భయము, అగ్ని భయము కలుగును. ఈ రాశి స్త్రీ పురుషాదులకు వివాహము కావలసిన వారు చాల సంబంధములు చూచినా సంతృప్తి కలుగదు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ గల్గి శారీరిక ఒత్తిడి అనుభవించి కష్టించిన ఫలితము తక్కువగా ఉండును. ఉపాధ్యాయులకు అధికారుల వత్తిడి, గౌరవ మర్యాదలు తగ్గుట , స్థానచలనం కల్గును. వ్యాపారస్తులకు లాభము కన్నా నష్టము అధికముగా ఉండును, రైతులకు తొలకరి పంట కన్నా దాళవా పంట లో మంచి లాభము కలిగించును, నువ్వులు, శనగ పంట నష్టము,మినుము పంట లాభము కలిగించును. వృత్తి పనివారలకు ఈ సంవత్సరము మధ్యమముగ ఉండును,సినీ రంగము, కళాకారులకు, గాయకులకు ఇబ్బందులు కలుగును , క్రీడాకారులకు గౌరవము, గుర్తింపు కలుగును. వైద్యులు, న్యాయవాదులు, పౌల్టి యాజమాన్యము, మత్స్య, పాడి పరిశ్రమల వారికి ఈ సంవత్సర లాభదాయకముగా ఉండును. తగినంత గ్రహ బలము లేకపోవుటచే ధనలాభములు అంతంత మాత్రంగా యుండును.

ఈ రాశివారు గురు, శని దోష నివారణకు శివాభిషేకములు, దక్షిణామూర్తి స్తోత్రము, మృత్యుంజయ మంత్ర జపము, శనగలు, నువ్వులు దానమియ్యవలెను.

చైత్రమాసం (13th April to 11th May) : గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయుట తద్వారా ధనవ్యయము, బంధు మిత్ర సమాగమము, కోపం, చిరకాలము నుండి యున్న సమస్యలకు పరిష్కార మార్గము దొరకుట, ధనాదాయం, ఆరోగ్యం, సంతోషము, వాహన, వస్త్ర లాభము కలుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట, అధికారుల వలన లాభము, మన్నలను పొందుట జరుగును. కుటుంబములో ఆరోగ్య భంగములు, వైద్య సేవ తప్పనిసరియగుట జరుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : సంతాన రీత్యా చిక్కులు, ధనవ్యయము స్థానభ్రంశము, స్థానచలన సూచనలు, స్వస్థానమును వీడి దూర ప్రాంతములకు వెళ్ళవలసి వచ్చును. చేయు పనిలో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చును.

ఆషాడ మాసం (11th July to 8th August) : వృత్తి వ్యాపారములు కలసిరాకపోవుట, నీచపు ఆలోచనలు, శిరోవ్యధ, చొర, అగ్ని భయము, దుష్ట మిత్ర సహవాసముచే చెడు పనులకు ప్రేరేపింపబడుట, ధన నష్టము, అనారోగ్యముచే ఔషధసేవ చేయుట, విలాసముల కొరకు ధనము ఖర్చు చేయుట జరుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : ధనలాభము, బంధు మిత్ర సమాగమము, నిత్య సంతోషము, బంగారం ఆభరణాలు కొనుగోలు చేయుట, శరీరారోగ్యము కుదుటపడుట, గృహ సౌఖ్యం గృహమున కళ్యాణాది శుభయోగములకు ప్రయత్నించుట జరుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : భోగభాగ్యములనుభవించుట, చక్కని ఆరోగ్యము, మృష్టాన్న భోజనము, శతృవర్గము నశించుట, అన్ని విషయములలోనూ ముందంజ, సంతానము అభివృద్ధిలోనికి వచ్చుట. పూర్వ మిత్రుల కలయిక కలుగును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : పుణ్య కార్యములు చేయుట, ఆలయ దర్శనము, నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట, అధికారుల వలన లాభము, మన్నలను పొందుట జరుగును, గృహమునందు మార్పులు చేయుట, వాహన ప్రమాదము, తల్లికి అనారోగ్యము కలుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : పరపీడ, అవమానములు, దూర ప్రయాణముల వలన ధన వ్యయము, సోమరితనము, అలసట, వ్యాపారములలో చిక్కులు,మానసిక అశాంతి,దైవానుగ్రహం కొరకు ప్రయత్నించవలెను.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : చక్కని ఆరోగ్యము, ప్రభువుల నుండి గౌరవ మన్ననలు, గృహమున శుభకార్య సిద్ధి, క్రయవిక్రయములలో లాభపడుట, అన్నింటా ముందంజ, భూమి కొనుగోలుచేయుట, సంతానం వలన సుఖము, గౌరవం కలుగును.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : భూ,గృహాది క్రయవిక్రయముల వలన నష్టము, ధనవ్యయము, కుటుంబ సమస్యలు అధికమగుట, ఆరోగ్య నియమములు పై శ్రద్ధ చేయవలెను, సంతానం విషయమై జాగ్రత్త అవసరము.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : భాగస్వామితో విభేదాలు కొంత మానసికముగా బాధించును, దూరదృష్టితో ఖర్చుల విషయమై ఆలోచించుట మంచిది.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : ఎల్లపుడు ఏదో ఒక సమస్య కలుగుట, చీటికి మాటికి అందరితోను మాటపట్టింపులు వచ్చుట, అనుకోని విపరీత | ఖర్చులు,ఆరోగ్య భంగము, భాగస్వామి ఆలోచనలు వ్యతిరేకించకుండా ఉండుట మంచిది.