PrajaPrashna

Telugu Daily Newspaper

కుంభం (Aquarius)

Acquarius(Kumbha)

కుంభం (Aquarius)

 

ధనిష్ఠ 3,4పా|| శతభిషం 4పా|| పూర్వభాద్ర 1,2,3పా11:- ఆదాయం 8 ఖర్చు – 14 రాజపూజ్యం – 7 అవమానం – 5

 

గురుడు: ఈ సంవత్సరమంతయు జన్మ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు వ్యయ మందు సంచరించును.రాహువు: సంవత్సారాది నుండి చతుర్థ మందు,కేతువు దశమ మందు సంచరించును.

ఈ సంవత్సరం గ్రహస్థితి అనుకూలంగా లేనందున తగుజాగ్రత్తలు తీసుకొనవలెను. నిరాడంబరముగా జీవించుట వలన మేలు కలుగును, దాన ధర్మములు,సాధువుల దర్శనము, దేవాలయ దర్శనము, అనాధలకు మరియు అంగవైకల్యము కలిగిన వారికి, గో సేవ చేయుట వలన మేలుకలుగును, ఎంత జాగ్రత్తగా వ్యవహరించినను ధననష్టము కలుగును, సక్రమంగా బుద్ధి పనిచేయకపోవుట, పదవులుకోల్పోవుట, కోపము, కీర్తి నశించుట, భయము, ఉద్యోగమునందు అనేక చిక్కులు,మాటపడవలసి రావడం, శరీరబాధ, దుఃఖములు, అకారణంగా కలహములు,వాహన ప్రమాదములు, స్త్రీలచేత పోషింపబడుట,మనఃస్థిమితం లేకపోవుట, వైరాగ్యము, వృత్తి పాడగుట, తెరలు తెరలుగా వస్తున్న బాధలు, స్వల్ప భోజనము, విరోధము, బంధు, మిత్ర, భార్యా, పుత్రులను విడిచి దూరముగ ఉండవలసి వచ్చుట, భిన్నమైన మనస్సును కలిగి ఉండుట, కుటిలమైన బుద్ధి, చాంచల్యము, అశాంతి, వాతభయము, తన చోటు వీడిపోవుట, ఇంటిలో ప్రసవము, అన్ని విషయములందు మిశ్రమ ఫలితములు, సంతాన కేశములు, ఎల్లప్పుడూ వ్యాధి, అకాల భోజనము,తిరిగే ఉద్యోగము చేయుట జరుగును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టము సంభవించు, ఉద్యోగస్తులు జాగ్రత్తగా నిజాయితీగా వ్యవహరించవలెను లేనిచో చిక్కులు తప్పవు. మత్స్య, పౌల్డీ వ్యాపారులు కూడా నష్టము చవిచూడ వలసి వచ్చును, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితములు కలుగును, విద్యార్థులకు ఆశించిన ఫలితం రాక నిరాశకు గురి అగుదురు. కళారంగం వారికి వృత్తి పనివారికి ఈ సంవత్సరం గడ్డుకాలము.

ఈ సంవత్సరం ఈ రాశివారు శివాలయం దర్శనం, శివ అభిషేకము, శివ స్తోత్ర పారాయణం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, చండీ పూజ, శనగలు, నువ్వులు, మినుములు దానము చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : ఈ నెలలో గొప్ప వారి స్నేహము, అనేక ఇబ్బందులు కలుగును, అనారోగ్యంతో బాధపడుట,కుటుంబవ్యక్తులతో విరోధాలు, చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉండదు, పనులందు ఆటంకాలు, ఆర్ధికలావాదేవీలు అనుకూలించవు, స్థిరాస్థినష్టాలు, సంఘంలో అవమానకర సంఘటనలు, ధనం విపరీతంగా ఖర్చగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : పనులు ఆలస్యముగానైన పూర్తి అగును, అనారోగ్యం తగ్గుముఖము పట్టును, సమయానికి ధనం చేతికందును, బంధుమిత్రుల సహాయ సహకారములు లభించును, వివాహాది శుభకార్యములలో పాల్గొనుట, సంతానసౌఖ్యం, భాగస్వామి సలహాలు సమయానికి ఫలించును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఈ నెలలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యాపార, వ్యవహారాలలో నష్టము, ధైర్యముతో కార్యక్రములు పూర్తి చేయుట, మనోవ్యాకులత, సంతానం ద్వారా చిక్కులు, వృధా ప్రయాణాలు. ఉద్యోగులకు ఆర్ధికంగా కలసివచ్చును, ధనమూలక ఇబ్బందులు తప్పవు.

ఆషాడ మాసం (11th July to 8th August) : ఈ నెలలో గ్రహసంచారం కొంతమేర అనుకూలంగా ఉన్నందువల్ల చేయు వృత్తి వ్యాపారాలు కలసివచ్చును, అన్నింటా జయం, ఆరోగ్యలాభం, ధనం సమయానికి చేతికి అందుట, ఆకస్మికంగా ప్రయాణాలు, ఖర్చుకూడా అధికంగా చేయవలసి రావడం,సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాలు, భూసంబంధ వ్యవహారాలు లాభించును.

శ్రావణ మాసము (9th August to 7th September) : ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా లేనందున ప్రతి చిన్న విషయానికి లోలోపల భయం, పనులందు ఆటంకాలు, ప్రభుత్వం ద్వారా ఊహించని చిక్కులు, ఆనారోగ్యము, వాహన ప్రమాదాలు, ఆప్తమిత్రులను కోలోవుదురు, విలువైన వస్తువులు చేజార్చుకోనుట, భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరును.

భాద్రపద మాసము (8th September to 6th October) : అనారోగ్యము చేయుట, శిరోవేదన, మనస్సంకటము, దుర్వార్తలు వినవలసి వచ్చుట, భయము, ఉద్యోగము కోల్పోవుట, చేతిలో ధనములేక ఇబ్బందులు పడుట,అవమానములు ఎదుర్కోవలసి వచ్చును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : ఈ మాసములో గ్రహస్థితి అనూకూలంగా లేనందున అన్నిరంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాలు నష్టము, ఆదాయమునకు మించి ఖర్చులు, అనారోగ్యము, ధైర్యం కోల్పోవుట, వాహన గండము, శతృవుల నుండి కొత్త సమస్యలు, దొంగల భయము,శరీరపీడ బాధించును.

కార్తీకమాసము (5th November to 4th December) : ఈ మాసము గ్రహస్థితి కొంత అనుకూలముగా ఉన్నందున అన్నింటా విజయం, దైవ కార్యాలలో పాల్గొంటారు, తీర్ధయాత్రా ఫలప్రాప్తి, ఆరోగ్యం కుదుటపడుట, ఆర్థికంగా నిలబడుటకు చక్కని ఆలోచనలు చేయుట, స్నేహితులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొనుట జరుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : ఈ మాసము నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట, ధనలాభము, అందరి ప్రశంసలు పొందుట, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనారోగ్యం నుండి ఉపశాంతి, దైవ సంబంధమైన కార్యక్రమములో పాల్గొంటారు.

పుష్య, మాఘ, పాల్గుణ మాసములు (3rd January, 22 to 1st February, 22, 2nd Februrary, 22 to 2nd March, 22, 3rd March, 22 to 1st April, 22) : ఈ మూడు మాసములు గ్రహస్థితి అనుకూలముగా లేదు. ఊహించని సమస్యలు, అనారోగ్య బాధలు, ధనము విపరీతంగా ఖర్చగుట, మానసిక ఇబ్బంది, ధైర్యం కోల్పోవుట జరుగును.