R S Praveen Kumar

 

కేసీఆర్ తన ఆస్తులు అమ్మి ఖర్చు చేయాలి

 

🔹బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ కుమార్
🔹బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా ఆర్ఎస్‌పి
🔹డబ్బుల విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్
🔹కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్‌పి

 

నల్గొండ (ప్రశ్న న్యూస్) మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీలో చేరారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతనం ప్రవీణ్‌కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా రాంజీ గౌతం ప్రకటించారు. నల్గొండలోని ఎంజీ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సభ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది..కార్యకర్తలు ,ఆయన అభిమానులతో సభ ప్రాంగణం నిండిపోయింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభను ఉద్దెశించి మాట్లాడారు. సభకు రాకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని ఆయన విమర్శించారు..అయినా ..తన బిడ్డలు ఆగలేదని అన్నారు..తాను రాజీనామా చేసిన రోజే కేసు పెట్టారని,ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు..అణగారిణ వర్గాల ప్రజల బిడ్డ ప్రవీణ్ కుమార్ అని, వీళ్లందరని ప్రభుత్వం ఎలా నిలువరిస్తుందని ఆయన ప్రశ్నించారు.అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకులు  సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో.. అతి త్వరలోనే ప్రగతి భవన్‌కు పోదామని అన్నారు.రాష్ట్రంలో కొన్ని  వర్గాలు అభివృద్దిలోకి వస్తున్నా..అణగారిన వర్గాలు మాత్రం తమ కుల వృత్తులు మాత్రమే చేసుకుంటూ బతుకుతున్నారని అన్నారు.. కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులు పెట్టి అనవసర ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు..అవన్ని పేద ప్రజలు కష్టించి కడుతున్న పన్నులతో సీఎం కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.

మరోవైపు దేశంలో 46 మందికి భారతరత్న ఇస్తే.. అందులో ఒక్కడే ఓబీసీకి చెందిన వాడు ఉండడం చాలా దుర్మార్గం అని నిలదీశాడు..దేశంతోపాటు రాష్ట్రంలో ఆధిపత్య కులాల వారే  పెత్తనం కొనసాగిస్తున్నారని విమర్శించారు.. గుప్పెడు మంది ఉన్న వారికే అందలం ఎక్కించి అణగారిణ కులాలను వెనక్కి నెట్టుతున్నారని అన్నారు. అణగారిన కులాలకు అధికారం ఇవ్వకపోతే..దాన్ని గుంజుకుంటామని హెచ్చరించారు. ఇక తాను ఆశించిన బహుజన రాజ్యం ఎలా ఉండబోతుందో ఆయన వివరించారు.. ఈ నేపథ్యంలోనే  బహుజన రాజ్యంలో ఇండియా.. చైనాతో పోటి పడబోతుందని ,చిన్నపిల్లను ఎవరెస్టు ఎక్కించిన మనకు ఇది పెద్ద లెక్క కాదని అన్నారు..కల్లుగీత కార్మికులు సైతం బహుజన రాజ్యంలో కంప్యూటర్ ఇంజనీర్లుగా మారతారని అన్నారు. మాల మాదిగల బిడ్డలు డాలర్లు సంపాదించేలా తాము ఏర్పాటు చేయబోయో బహుజన రాజ్యంలో ఉంటుందని అన్నారు… దేశ సంపదలో బహుజనులకు భాగస్వామ్యం ఉందని,అందుకే వారికి రిజర్వేషన్లు ఉండాలని ఆయన డిమాండ్ చేశాడు..అయితే బహుజన రాజ్యం అంత సులువుగా రాదని అందుకోసం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మరోవైపు కేసీఆర్ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారే నిర్ణయించుకునేలా చేయాలని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. విచ్చలవిడిగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అంటూ కేసీఆర్‌ను ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులు? అని నిలదీశారు. గిరిజన, ఆదవాసీ బిడ్డలు సాగు చేసిన డబ్బులే ఇచ్చారన్నారు. తమ కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.దళిత, గిరిజనులపై ప్రేమ ఉంటే కేసీఆర్ సంపాదించిన సంపాదించిన సొమ్ము ఇవ్వాలన్నారు. పేదలకు వైద్యం, విద్య, ఉపాధి నైపుణ్యం కావాలన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా కేవలం 4 లక్షల మందికే విద్య అందుతోందని, 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారన్నారు. పేదలు చదివే వర్సిటీల్లో 3-4 ఏళ్లుగా నియామకాలు లేవన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మరి ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? అని ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో మరో పార్టీ క్రియాశీలకంగా మారనుందనే చెప్పాలి.