కేసీఆర్, హరీష్ రావు పోటీకి సిద్ధమా.?
హుజూరాబాద్‌లో తన గెలుపును ఆపలేరన్న ఈటల
కరీంనగర్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా నియోజకపరిధిలో పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవల స్వస్థతకు గురైన ఆయన మళ్లీ కోలుకొని పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆదివారం హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ఈటల రాజేందర్ పర్యటించారు. ఆయన సమక్షంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా.. నా గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు దమ్ముంటే నాపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎవరు వస్తారో రండి… చూసుకుందాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
”రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరు. హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం. వస్తవా. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్. బక్క పల్చటోడు, దిక్కులేనివాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నారేపు ఎన్నికల్లో చూసుకుందాం. ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లువాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటారో… చంపుకుంటారో మీ ఇష్టం. ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదు. రేపు దళిత బంధు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.” అని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రలోభాలను ఆపి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలని విమర్శించారు ఈటల రాజేందర్. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతని అన్నందుకు.. ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే.. తన మీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని అన్నారు. కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు.. ఆ సొమ్మంతా మీదే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఐతే తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారని… అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వాళ్లు ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్. కాగా, కొన్ని రోజులుగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఐనప్పటికీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts:
ఈటలపై స్వరం పెంచిన టీఆర్ఎస్ అగ్రనేతలు
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే
తెలంగాణలో ఇంత ఘోరమా.? ప్రశ్నించేవారే లేరా..?
ఊరించి ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగాల భర్తీ
2024 ఎన్నికలకు అదిరిపోయేలా మోదీ మాస్టర్ ప్లాన్ ..
తెలంగాణలో పాగా కోసం బీజేపీ, ఈడీ దాడులు.?
దిగ్విజయంగా అంతరిక్షయానం
భారీగా పడిపోయి మోదీ గ్రాఫ్.. ఏడాదిలో 40 శాతం తగ్గిన పాపులారిటీ