కోవిడ్ రోగులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం : ప్రో.కోదండరాం

 

🔹పేద ప్రజల ప్రాణాల కోసం కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి
🔹అహంకారం నెత్తిక్కెకితే చరిత్ర హీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు
🔹ప్రజల బాగోగులు విస్మరిస్తే పాలకులకు పుట్టగతులుండవు
🔹ప్రజలకు కావలసింది  నీచ రాజకీయాలు కావు సరైన చికిత్స
🔹మీ పాలనలో ఏ ఒక్కరు సుఖంగా లేరు
🔹ఇంకెన్ని రోజులు వేతన సవరణపై మీ జిమ్మిక్కులు
🔹ఇటీవల చేసిన మీ దుష్ట రాజకీయాలతో ప్రజలు అలసిపోయారు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్ బ్యూరో) కరోనా వైరస్ వ్యాప్తిపై మొదటి నుండి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రాష్ట్రాన్ని శవాలదిబ్బగా మార్చిన మన పాలకులు తమ వైపల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆడని నాటకం, పాడని పాట లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థంభింప చేసి అధికారులను తన తోత్తులుగా మార్చుకొని తెలంగాణా రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా ఉహించుకుంటు పాలన వెలగబెడుతున్న పాలకులకు ప్రజలు తొందరలోనే తగిన బుద్ది చెప్పెందుకు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మీ బానిసలు కారని వారి వల్లనే నువ్వు అనుభవిస్తున్న ఈ రాజభోగాలు దక్కాయని అధికారబలం, అహంకారం నేత్తిక్కెక్కి ప్రజలను వారి బాగోగులను విస్మరిస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. గతంలో అధికారమదం, అహంకారంతో నియంతృత్వం పోకడలకు పాల్పడిన అనేకమంది పాలకులు చరిత్ర హీనులుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోయారని అలాంటి దుస్థితిని కొరి తెచ్చుకొవద్దని హితవు పలికారు. ప్రజలు అమాయకులు కారని నీ కుటుంబ రాజకీయ సంక్షేమం కోసం చేస్తున్న అసత్యపు ప్రకటనలకు, కల్లబోల్లి మాటలకు కాలంచెల్లే రోజు అతి దగ్గరలోనే ఉందని ప్రజలు తిరగబడిన రోజు దాక్కోవడనికి స్థలం కూడా ఉండదని హెచ్చరించారు. కరోనా ఉదృతిలో పాలనను వదిలేసి ఫాంహౌజ్ లో పడకేసి, ప్రభుత్వ చేతగానితన్నాని కప్పిపుచ్చుకునేందుకు నీచ రాజకీయాలతో ఈటల ఎపిసొడ్ ను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిమరల్చే ప్రయత్నాలు చేసావని విమర్శించారు. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోవడం ప్రజలపై ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని  వారిని ప్రతిసారి మోసం చేయగలను అనుకోవడం  అవివేకమన్నారు. ప్రస్తుతం ప్రజలకు కావలసింది నీచ రాజకీయాలు కావని వారికి సరైన ఆరోగ్యరక్షణ కల్పించాలని కోదండరాం డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పాలనంతా అవినీతితో అత్యంత గందరగోళంగా మారిందని, కొంతమంది అధికారులు లంచాలు ఇస్తే తప్ప విధులు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగు ప్రజల బాగోగులు పట్టించుకునే పాలన అందించడం  చేతకాదని అన్నారు. నువ్వు నీ తొట్టిగ్యాంగ్ కలిసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చి దోచుకొని దాచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు కోదండరాం.ఓ వైపు కరోనా మరో వైపు ఎండనకా, వాననకా కష్ట నష్టాలకు ఎదురొడ్డి పండించుకున్న పంటలను అమ్ముకొవడానికి రైతుల ఇబ్బందిగా మారిందన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటు రోగులకు సేవలందిస్తున్న వైద్యసిబ్బంది ఇబ్బందులు, ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సమస్యతో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా ప్రశాంతంగా ఉంటూ తుచ్చా రాజకీయాలు చేస్తున్నందుకు భారీ మూల్యం చెల్లింకోక తప్పదని జోస్యం చెప్పారు కోదండరాం.
ఉద్యమకాలంలోఎందరినో వాడుకుని నీచ కుట్రలతో నేడు అందరిని కనునుమరుగుచేసి గద్దెనెక్కి  ఉద్యమ వ్యతిరేకులతో ఒక కోటరి నిర్మించుకుని నిరంకుశ పాలన విధానమే ఎదో ఒకనాడు నీకు వెన్నుపోటు పోడవకపోదని హెచ్చరించారు. ఇటీవల చేసిన దుష్టరాజకీయాలను వల్ల  మెల్ల మెల్లాగా  వెన్నులో వణుకు ప్రారంభమైందని అనడానికి నిదర్శనమే ఆదరబాదరగా  చేస్తున్న ఆస్పత్రుల సుడిగాలి పర్యటనలు. కేవలం ప్రజల దృష్టి మరల్చి  వైపల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడని తూతూ మంత్రపు పర్యటనలు వెనుక ఉన్న  కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రంటే ఫాంహౌజ్ లో ఉండాలి కానీ ప్రజారోగ్యాన్ని ఏనాడు పట్టించుకోరన్న విమర్శలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  ఆస్పత్రుల వెంట తిరగడం ఏకంగా పిపిఇ కిట్ లేకుండానే కరోనా రోగులను పరామర్శించడంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, మళ్శీ ఏదో పెద్ద  ప్లానే చేస్తున్నారనే నిషితంగా గమనిస్తున్నారని దుయ్యబట్టారు.