గర్జించిన కలాలు

 

🔹అక్షర పోరాటంలో ఐక్యతను చాటుదాం

🔹“టీజేఎస్ఎస్” మహాసభలో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి

🔹జహంగీర్ పీర్ దర్గాలో ఘనంగా “టీజేఎస్ఎస్” 2వ మహాసభ

🔹పెద్దఎత్తున హాజరైన రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల జర్నలిస్టులు

🔹“టీజేఎస్ఎస్” డివిజన్ కొత్త కమిటీల ఏర్పాటు

🔹జర్నలిస్టులను వేధిస్తే పోటీగా నామిషన్లు తప్పవు – అనంచిన్ని వెంకటేశ్వర రావు సంచలన ప్రకటన

 

షాద్ నగర్ (ప్రశ్న న్యూస్) అక్షర పోరాటంలో ఐక్యతను చాటే విధంగా జర్నలిస్టులు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని జర్నలిస్టు సంఘాలు ఒకే వేదిక పైకి రావాలని తద్వారా ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుందని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ రెండవ మహాసభలకు పాశం యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా “టీజేఎస్ఎస్” రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షులు గాదె ఇన్నయ్య, తెలంగాణ సోషల్ మీడియా ఫెడరేషన్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మహిళా సీనియర్ జర్నలిస్టులు సాజిదా సికందర్, హనుమకొండ విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ, యాలాల శ్రీధర్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం. డి ఖాజాపాషా (కేపి) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జెపి దర్గాలో జరిగిన సభకు షాద్ నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆయా పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రతినిధులు హాజరయ్యారు. సభలో పాశం యాదగిరి మాట్లాడుతూ.. మీడియా మాఫియాకు దాసోహం అయిన ప్రస్తుత తరుణంలో సామాజిక మాధ్యమాలతోనే సమాజ ఉద్ధరణ జరుగుతుందని, సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నదని సూచించారు.    హిందూ ముస్లింల ఐక్యతను చాటే జహంగీర్ పీర్ దర్గాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజాన్ని చూసి చలించి ప్రతి ఒక్కరూ పాత్రికేయులేనని, కంటి ముందు కనిపించే సమస్యలను ఫోన్ల ద్వారా వెలుగులోకి తెచ్చి పరిష్కారాలు సాధించుకోవాలని అన్నారు. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న జర్నలిజానికి బతుకు మెతుకు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. పాత్రికేయులు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తేవాలన్నారు. మానవత్వానికి పునాది వేయగలిగేదే నిజమైన జర్నలిజం అన్నారు. ప్రతి మనిషికి జర్నలిజాన్ని ఆత్మగా మార్చాలి అన్నారు. తెలంగాణ పోరాట యోధుడు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ కంటి ముందు జరిగే నేరాలను నిరోధించలేకపోతే పాత్రికేయులు కూడా నేరస్తులు అవుతారన్నారు. రాత్రింబగళ్ళు సమాజం కోసం శ్రమించేది ఒక్క పాత్రికేయు లేనని పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల్లో నిరంతరం పాలుపంచుకుంటూ వారి వెన్నంటే ఉంటాను అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకు రావాలని, సంక్షేమ సంఘం పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తుందన్నారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టులు వేధించిన రాజకీయ నాయకులపై ఎన్నికల్లో  నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. దానికి సంబంధించిన నిధులు, విధులు అన్నీ తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమ మహిళ, జర్నలిస్టు సాజిదా సికిందర్  మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక జర్నలిస్టుల బతుకులు రోడ్డున పడ్డాయని ఆక్రందన వ్యక్తం చేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ ఎండీ ఖాజాపాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈ కార్యక్రమంలో గౌటి రామకృష్ణ, యాలాల శ్రీధర్, విజయలక్ష్మి, లట్టుపల్లి మోహన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

🔹రాష్ట్ర కమిటీ సభ్యులుగా జే. రాఘవేందర్ గౌడ్

తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జె రాఘవేందర్ గౌడ్ ప్రత్యేకంగా నియమితులయ్యారు. రఘును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రకటించారు.

🔹షాద్ నగర్ డివిజన్ నూతన కమిటీలు..

జర్నలిస్టు సంక్షేమ సంఘం షాద్ నగర్ డివిజన్ నూతన కమిటీ అధ్యక్షుడుగా సీనియర్ జర్నలిస్టు సరాపు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వావిలాల హరి జీవన్, ఉపాధ్యక్షులుగా ఫణి కుమార్, శ్రీధర్ రాజు, కోశాధికారిగా వజ్రలింగం, మీడియా అధికార ప్రతినిధిగా వై. శేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శలుగా అర్షద్, సందీప్, ప్రచార కార్యదర్శిగా  రామకృష్ణ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా వహీద్, సురేష్, పుల్లారావు, నరేందర్ గౌడ్, జగన్, ఖాజా షబ్బీర్, మచ్చెందర్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, కన్నా, అరుణ్ కుమార్, సురేందర్ ఎన్నికయ్యారు.

🔹టీజేఎస్ఎస్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా ఫయాజ్..

తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం షాద్నగర్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘం అధ్యక్షుడిగా ఎం.డి ఫయాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ ఉపాధ్యక్షులుగా బిక్షపతి ఎన్నికయ్యారు.

🔹టీజేఎస్ఎస్ ఉర్దూ కమిటీ అధ్యక్షుడిగా మొయిజోద్దీన్..

టీజేఎస్ఎస్ ఉర్దూ కమిటీ డివిజన్ అధ్యక్షుడిగా మొయిజోద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలువురు ఉర్దూ పాత్రికేయులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాత్రికేయులు రాఘవేంద్ర గౌడ్, సరాపు రమేష్, హరి జీవన్, ఫణి కుమార్, శ్రీధర్ రాజ్, చందు, అరుణ్ కుమార్, ప్రవీణ్, నరేందర్ గౌడ్, సందీప్, శేఖర్ యాదవ్, వజ్రలింగం రామకృష్ణ మరియు వనమూలిక వైద్యులు సుదర్శన్ ముదిరాజ్, తదితర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.