జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కేసు, కీలక మలుపు
🔹విచారణ చేపట్టిన హైకోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ.!
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ వ్యవహారం ఊహించని విధంగా కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘తొలివెలుగు’ జర్నలిస్ట్ రఘ కిడ్నాప్ జరిగిన తీరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఉదయం 9.45గంటల ప్రాంతంలో మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్న రఘును ఒక్కసారిగా కొందరు దుండగులు చుట్టుముట్టి ముసుగువేసి, పెడరెకక్కలు విరిచి నెంబర్ లేని వాహనంలో కిడ్నాప్ చేశారు. అమానవీయ సంఘటన పట్ల పౌర సమాజం భగ్గుమంది. సామాజిక మాధ్యమాలలో ఒక్కసారిగా విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో పోలీసులు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పోలీసులు రఘు భార్యకు నోటీసులు ఇచ్చారు. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన పోలీసులు రఘుపై మరోకేసు తెరపైకి తెచ్చారు. రఘుకు బెయిలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన 13 రోజులు జైల్లో మగ్గారు.
బిసి కమిషన్ సీరియస్..
జర్నలిస్ట్ రఘును తీవ్రవాదిలా రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటంపై జాతీయ బీసీ కమీషన్ సభ్యులు టీ.ఆచారి నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ళటం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు అని గతంలో ఆనంచిన్ని వెంకటేశ్వర్ రావు ను కూడా ఖమ్మంలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. అదే రోజు కొల్లాపూర్ లో అవుట రాజశేఖర్ వార్తలు ప్రచురించాడని స్టేషన్ లో దారుణంగా చిత్రహింసలు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో మానవ హక్కులు లేవా.? ఈ విషయంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను ఢిల్లీ రావాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణా రాష్ట్రము వచ్చిన తరువాత పోలీసులు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం దేనికి నిదర్శనమని ఇవి మంచి పరిణామాలు కావన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించగలరా.? జర్నలిస్టు లను వీధి రౌడీలుగా బావిస్తున్నారా.? అని ఫైర్ అయ్యారు.
న్యాయదేవత తలుపు తట్టిన…
కిడ్నాప్ వ్యవహారం సిసి ఫుటేజ్ ను జత చేస్తూ జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మి ప్రవీణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు న్యాయం కోసం గత నెల 11న లేఖ రాశారు.
స్పందించిన హైకోర్టు…
రఘు భార్య సీల్డ్ కవర్ లో అందించిన ఆధారాలను హైకోర్టు పూర్తి స్థాయిలో పరిశీలించింది. అనంతరం హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా నల్గొండ ఎస్పీని (లెటర్ నెం: ఆర్ ఓ.సి. నెం:1114 హెచ్.సి.ఎల్.ఎస్.సి. 2021 తేది: 6.7.2021) ఆదేశించింది.
ధన్యవాదాలు తెలిపిన టిజెఎస్ఎస్..
తొలివెలుగు జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ పై హైకోర్టు స్పందించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.