టిఆర్ఎస్ ను వెంటాడుతున్న ఓటమి భయం: ప్రో.కోదండరాం
🔹ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇంత హడావుడా.?
🔹ప్రభుత్వ దారులన్ని హుజూరాబాద్ కే
🔹ఉప ఎన్నికల వరకు హుజూరాబాదే రాష్ట్ర రాజధాని
🔹రాష్ట్ర సమస్యలపై పడకేసిన పాలన
🔹అవినీతి, అక్రమ అధికారులపై చర్యలు శూన్యమేనా.?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ ఉప ఎన్నిక తో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని దీంతో ఎటు పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారాని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసిఆర్ అహంకార, నిరంకుశ దోరణి వల్ల వచ్చిందని ఇది బలంగా ప్రజల్లో వ్యాపించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో. కోదండరాం విమర్శించారు. దీనిని గ్రహించిన కేసిఆర్ ముఖ్యమంత్రి స్థాయి లో ఉండి గల్లిరాజకీయాలు చేస్తు ప్రజల్లో లేని ఆశలను రేకేత్తిస్తు అచరణ యోగ్యం కానీ బూటకపు హమీలను విచ్చల విడిగా ప్రకటిస్తు మళ్ళీ జనాలను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు కేసిఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక దళితుల పై లేని ప్రేమ ను ఒలకబోస్తు దళిత బందుతో దళిత సమాజాన్ని తన మాయ మాటలతో మోసం చేసేందుకు ఎత్తులు వేస్తున్నాడని ఇది దళితులపై ప్రేమ కాదని వాళ్ళ ఓట్లు పడే వరకే, ఆ తర్వత అసలు దొర మళ్ళీ బయటకొస్తాడని కోదండరాం దుయ్యబట్టారు. నీవు ఎన్ని వేశాలు వేసి హుజూరాబాద్ ప్రజల కాళ్ళు కడిగి నేత్తిన పోసుకున్నా నిన్ను నమ్మె పరిస్థితి లేదని విమర్శించారు. అధికారతో డబ్బు మద్యం వ్యదజల్లి లబ్దిపోదాలను కుంటే ఆది నీ అవివేకమే అవుతుందని విరుచుకు పడ్డారు. ప్రస్తుతం రాబడి నంతా ఒక్క హుజూరాబాద్ నియోజవర్గానికే ఖర్చు చేస్తే మిగితా నూట పద్దెనిమిది నియోజకవర్గాల మాటే మిటని ప్రశ్నించారు. అధ్యక్షుడి అజ్ఞ తో హుజూరాబాద్ కు వచ్చే మంత్రులు మొదట వారి నియోజక వర్గ ప్రజలకు సమాదానం చెప్పల్సిఉందని, హుజూరాబాద్ లో ప్రకటించి న ప్రతి హమీని మీ మీ నియోజక వర్గాలలో ఎప్పుడు అమలు చేస్తారో ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేసారు. లేదా మీరు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు మార్గం వేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేందుకు సహకరించాలని లేని పక్షం లో ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి తంతారని హెచ్చరించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు ఋణపడి ఉన్నారని ఈటల రాజీనామ తో ఉప ఎన్నికలు వస్తున్నాయని సంక్షేమ పథకాలతో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పాలకులు అడ్డదారులు తోక్కుతున్నా రని, ప్రజలు తమ హక్కుగా భావించి పథకాలను అనుభ వించాలని అలాగే పాలకుల కుట్రలు కుతంత్రాలను పాతర వేయాలని కోదండరాం పిలుపు నిచ్చారు. దళితులపై నీకు చిత్తశుద్ది ఉంటే దళిత బందు తో పాటు గతంలో అత్యంత ఆవేశంగా మెడనైనా కోసుకుంటా కాని ఇచ్చిన హమీలు వెనక్కు తీసుకోన్నన మీరు మెడ కోసు కోవలసిన లేదు కాని దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భుమి,డబల్ బెడ్ రూమ్స్ , 125 అడుగు అంబేద్కర్ విగ్రహన్ని వంటి హమీలను అమలు చేసి మీ చిత్తశుద్దిని నిరూపించు కోవాలని డిమాండ్ చేసారు.
ఒక నియోజక వర్గ ఉప ఎన్నికకు రాష్ట్ర అధికార యంత్రంగానంతా హుజూరా బాద్ కే పరిమితం చేస్తు ఎన్నికల వరకు హుజూరాబాదే రాష్ట్ర రాజధానిగా మారిందటే ఈ గొప్పతనం అంతా ఈటలకే చెందుతుందని కనీసం జిల్లా కేంద్రం కూడ కాని హుజూరాబాద్ ఏకంగా రాష్ట్ర రాజదాని హోదాను పోందడం అక్కడి ప్రజల అదృష్టమని, ఎన్నికల వరకే ఈ హడావుడని ఎన్నికలు ముగిసిన తెల్లారి దళిత బందు తో పాటు అన్ని సంక్షేమ పథకాలు,హమీలు అవిరై పోతాయని ఎద్దేవ చేసారు. కేసిఆర్ కుట్రలను కుతంత్రాలను ప్రజలు ఇప్పటికే గ్రహిచారని, పగటి వేశాలతో మాయ మాటలకు ప్రజల మోసపోయె కాలం పోయిందని పాలకులు గ్రహించి ప్రజల సంక్షేమం గుర్తించి ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు పట్టం కడతారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సూచించారు.