తెలంగాణకే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ ఉండాలి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరీంనగర్లో లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన శనివారం హైదరాబాద్ లో ఒక విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కే. తారకరామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ నగర మేయర్ మరియు జిల్లాకు సంబంధించిన అధికారులు, సాగునీటి శాఖ, మునిసిపల్ వంటి వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మానేరు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ లేదా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ మానేరు రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కు అవకాశం ఏర్పడిందని, ముఖ్యమంత్రి కేవలం సాగునీటి కోసమే కాకుండా ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల తోపాటు టూరిజం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు వేశారని, అందులో భాగంగానే కాళేశ్వరంతో పాటు కరీంనగర్ వద్ద మానేరు రివర్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారనీ ఆయన అన్నారు.
ఇప్పటికీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం కోసం రూ. 310 కోట్లలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఫ్రంట్ డెవలప్మెంట్ ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పలు ఇతర రాష్ట్రాలు ఇలాంటి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లోనే చేశాయని అయితే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు కరీంనగర్ పట్టణంలో ఇంత భారీ ఖర్చుతో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ డెవలప్ చేయాలన్న విజన్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికి కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉన్నదని, పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కరీంనగర్ పట్టణం మరింతగా అభివృద్ధి అవుతుందన్న ఆశాభావం కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కి అవసరమైన సహాయ సహకారాలను సాగునీటి శాఖ తోపాటు భూసేకరణ వంటి అంశాల్లో రెవెన్యూ శాఖ మరింత వేగంగా ముందుకు పోవాలన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచన నుంచి పురుడు పోసుకున్న మానెరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు తీసుకుపోతామని స్థానిక జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. త్వరలో ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికిల్ వరకూ ఆ బాధ్యతలు కుడా నిర్వహిస్తుందని వెంటనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే మానేరు రివర్ ప్రంట్లో అంతర్భాగమైన 4 చెక్ డాంలు పూర్తయ్యాయని, మరో చెక్ డాంతో పాటు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చివరిదశలో ఉన్నాయన్నారు. సీఎం ప్రోత్సాహం వల్లనే ఈ కార్యక్రమం ఈ రోజు ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రివర్ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమంలో టూరిజం శాఖ ఇప్పటికే చురుగ్గా పనిచేస్తుందని, తమ శాఖ తరఫున ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల కార్యక్రమాలను తాము చేపడతామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Related posts:
సీఎం వైఎస్ జగన్‌కు సమన్లను జారీ చేసిన సీబీఐ, ఈడీ కోర్టులు
టీఆర్ఎస్ నేతలకు అల్జీమర్స్ వ్యాధి
దళిత బంధుపై పిల్ కాదు..పిటిషన్ వేయండి... - హైకోర్టు ధర్మాసనం
సెక్రటేరియట్‌ను విజిట్ చేసిన సీఎం కేసిఆర్..
వాసాలమర్రి మీద కేసీఆర్ కు ఎందుకంత ప్రేమ...
తెలుగు అకాడమీ కేసు
వైఎస్ఆర్ చేయూత పథకం
తెరాసలో ఆధిపత్య పోరు.. నేతల మధ్య పెరుగుతున్న దూరం