YSRTP

 

తెలంగాణ గడ్డమీద వైఎస్ఆర్ బిడ్డ

 

తెలంగాణలో మరోపార్టీకి అంకురార్పణ జరిగింది. స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల నూతన పార్టీని ప్రకటించింది. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణగా ఆమె స్వయంగా ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాను విజయమ్మతో కలిసి డిజిటల్ స్క్రీన్‌పై ప్రారంభించారు.. హైదరాబాద్‌ రాయదుర్గలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన సభా వేదికపై వైఎస్ షర్మిల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు …కాగా పార్టీ జెండాను పాలపిట్ట, నీలం రంగుతో కూడిన తెలంగాణ మ్యాప్‌‌తో పాటు మధ్యలో వైఎస్ఆర్ ఫోటోతో రూపోందించారు.

 

🔹పార్టీలో 3 అంశాల ఎజెండా
🔹తరాలు మరీనా తలరాతలు మారడం లేదు
🔹అందరిపట్ల సమానత్వం చూపే పార్టీ తమదని అన్నారు
🔹మహిళలకు 50 శాతం టికెట్లు
🔹ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి సంధర్బంగా వైఎస్ షర్మిల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు షర్మిల ఇడుపులపాయలోని కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె నేరుగా మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ నుండి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. కాగా విమానాశ్రయంలో ఆమెకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. షర్మిల పార్టీ కార్యకర్తల ర్యాలీతో కలిసి పంజాగుట్టలోని వైఎస్ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కార్యకర్తలు రాయదుర్గలోని సభవేదికకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతోపాటు పలువురు నేతలు సభలో పాల్గోన్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుండే సభవేదిక వద్దకు కార్యకర్తలు భారి ఎత్తున చేరుకున్నారు. కాగా సభ ప్రాంగణానికి వైఎస్ షర్మిల సాయంత్రం అయిదు గంటలకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకున్నారు. ఆ వెంటనే సభా స్థలంలో ఏర్పాటు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకు గంట ముందు షర్మిల భర్త అనిల్ సభాస్థలానికి చేరుకుని  ఏర్పాట్లను పరిశీలించారు. ఇక సభ షర్మిల పార్టీ అవిష్కరణకు ముందే … వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పార్టీ జెండాను డిస్‌ప్లే చేశారు. జెండాలో తెలంగాణ మ్యాప్‌ నుండి   వైఎస్ఆర్ చేతులు ఊపుకుంటూ అభివాదం చేస్తున్నట్టుగా రూపోందించారు. తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల పేర్లు ఒక్కోక్కటిగా డిస్‌ప్లే అయ్యాయి. ఆ సమయంలోనే తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ బిడ్డా అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక షర్మిల పార్టీ ప్రస్థానం మొత్తం మూడు నెలల్లోనే పూర్తయింది.. రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిల  ఖమ్మంలో ఏప్రిల్ 9న  సంకల్ప సభలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా సభకు అనుమతి ఇచ్చింది. దీంతో సుమారు ఆరువేల మందితో సభను కొనసాగించారు.

తాను తెలంగాణ బిడ్డనే అంటూ ప్రసంగం సాగించిన షర్మిల వైఎస్ఆర్ అంటే సంక్షేమ సంతకం అని  అన్నారు. వైఎస్ఆర్ అంటే చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని రూపం, కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ప్రజల మేలుకోరి పని చేశారని.. సాయం కోసం మన తర అనే భేదం తేడా లేకుండా వ్యవహరించారని చెప్పారు. వైఎస్ఆర్ మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టే, శత్రువుల చేత ప్రశంసలు పొందారని గుర్తుచేశారు. అందుకే ఆయన జయంతి రోజున వైఎస్ఆర్ టీపీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. తమ ఎజెండాను త్రిబుల్‌ “ఎస్” ఫార్ములాను ప్రకటించారు. ఇందులో సంక్షేమం, స్వయం సమృద్ది, సమానత్వం అనే ఎజెండాను ప్రకటించారు. రేపటిపై భరోసా ఇవ్వడమే సంక్షేమం అని చెప్పారు. ఉచిత విద్య, ఫీజు రీయింబర్స మెంట్, ఉచితంగా వైద్యం అందించిందని వైఎస్ఆర్ హయాంలోనని చెప్పారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 అంబులెన్స్ వచ్చేదని వివరించారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని.. 11 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఫిలప్ చేశారని పేర్కొన్నారు. పావలా వడ్డీకే రుణాలు, భూమిలేని నిరుపేదలకు భూమి, పక్క ఇళ్లు నిర్మించారని.. సంక్షేమ పాలన తీసుకురావడమే తమ లక్ష్యం అని చెప్పారు.

కేసీఆర్ ఫ్యామిలీకి ఉపాధి కలిగిందని షర్మిల విమర్శించారు. నలుగురికి ఉద్యోగం వచ్చిందని మరీ నిరుద్యోగుల సంగతి ఏంటీ అని అడిగారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేరిస్తే.. ఆసరా, భరోసా ఉండేదని.. కరీంనగర్‌లో ఓ మహిళా దీనగాధ వివరించారు. తమ పార్టీ నాణ్యమైన వైద్యం, ఉచితంగా అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు, చేతికి చిప్పలు అని.. అదే వైఎస్ఆర్ అయితే సంక్షేమానికి రారాజు పేర్కొన్నారు. తరాలు మారుతున్నాయి కానీ తలరాత మారడం లేదన్నారు షర్మిల. స్వయం సమృద్ధి.. కుటుంబాలను, గ్రామాలను తయారుచేయాలన్నారు. బీఎడ్, నర్స్, పోలీస్, క్లర్క్ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉన ఎన్నిక వస్తే చాలు త్వరలో ఉద్యోగాలు అనే ప్రకటన చేస్తారు. కోచింగ్ పూర్తయిన జాబ్ లేదు. స్కిల్ డెవలప్ మెంట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వని మోసగాడు కేసీఆర్ అని ఫైరయ్యారు. ఉపాధి లేకుండా స్వయం సమృద్ది ఎలా సాధ్యం అని అడిగారు. స్వయం సమృద్దికి అప్పులు అడ్డుగోడలుగా నిలిచాయని చెప్పారు.

బతుకమ్మ.. ఎలా అందంగా ఉంటుందో.. వివిధ వర్గాల వారిని ఒకచోట చేరిస్తే.. సమానంగా ప్రేమ, గౌరవించారు వైఎస్ఆర్ అని చెప్పారు. కులాలు, మతాలు, ఆడ, మగ, ఉన్నవారు, లేనివారు.. మెజార్టీ, మైనార్టీ అనే తేడా తమ పార్టీ చూపదని షర్మిల అన్నారు. జనాభాలో సగ భాగం మహిళలు ఉన్నా.. ప్రాధాన్యం ఇవ్వడంలో విఫలం అయ్యారని విమర్శించారు. పాలనలో సమాన భాగస్వామ్యం ఎందుకు ఇవ్వరని అడిగారు. అధికార నిచ్చెనలో అట్టడుగులోనే ఉన్నారని చెప్పారు. మహిళలు వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఉండాలా..? ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులుగా పనికిరారా అని నిలదీశారు. మహిళకు కుర్చీ వేయరు, మహిళా సాధికారత అని చెబుతారని ఫైరయ్యారు. 50 శాతం మంది మహిళలను కూర్చొబెట్టాలనేదీ తమ ఆకాంక్ష అని చెప్పారు. చేపట్టమే కాదు, చేసి చూపిస్తాం అని స్పష్టంచేశారు. హోం మంత్రిని చేసిన వైఎస్ఆర్ బిడ్డగా చెబుతున్న.. 50 శాతం మహిళలే కూర్చొవాలనేది తమ లక్ష్యం అన్నారు. పాలకుల ఆలోచనల్లో వెనకబాటుతనం ఉంది. బీసీల్లో కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అవమానిస్తున్నారని ఫైరయ్యారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. ఆ తలకాయ సంగతెంటో చెప్పండి కేసీఆర్ సార్ అని అడిగారు. దళితులు, గిరిజనుల మీద దాడి జరిగితే స్పందించారు అని ఫైరయ్యారు. నెరేళ్ల ఘటనలో.. ఇసుక అక్రమ రవాణా… ఇసుక లారీల కింద చనిపోతున్నారని అడిగితే దాడి చేస్తారు.. మరియమ్మ దళిత మహిళ లాకప్ డెత్.. ఎస్టీ మహిళ పోడు భూముల కోసం.. బట్టలూడదీసి కొట్టి చంపేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

మైనార్టీల డెవలప్ చేయలేదన్నారు. 4 శాతం రిజర్వేషన్ వైఎస్ఆర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓటుబ్యాంకుగా మైనార్టీలు, బీజేపీ- హేట్ బ్యాంకుగా మైనార్టీలు.. కానీ తమకు ఫైట్ బ్యాంకుగా ఉంటారని చెప్పారు. 1200 ఆత్మ బలిదానం చేసుకుంటే. 400 మంది గుర్తించి.. 800 మందికి ద్రోహం చేశారని ఫైరయ్యారు. ఉద్యమకారులపై కేసులు పెట్టడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. స్వరాష్ట్ర ఉద్యమకారులను సత్కరించాలి.. సేవలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్ల నుంచి ఏపీ ప్రాజెక్టు కడితే ఇప్పుడే మెలకువ వచ్చిందా.. కేసీఆర్ అని ప్రశ్నించారు. భోజనం చేస్తారు.. స్వీట్లు తింటారు.., 2 నిమిషాలు కూర్చొని మాట్లాడలేదా…? అని అడిగారు. రాష్ట్రాలుగా విడిపోయాం.. అన్నదమ్ములుగా కలిసే ఉందాం అని చెప్పారు. న్యాయబద్దంగా దక్కాల్సిన నీటిని వదులుకోం అని చెప్పారు. సమన్యాయం జరగాలి అన్నదే తమ పార్టీ సిద్దాంతం అని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఉందంటే.. వైఎస్ఆర్ అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు దూషిస్తుంటే.. చేతగాని దద్దమ్మలు అని విమర్శించారు. వైఎస్ఆర్ అని ఉచ్చరించే హక్కు, అధికారం లేదన్నారు. బండి సంజయ్.. ఆధారాలు ఉంటే, కేసీఆర్ జైలు పెట్టడం లేదని అడిగారు. ఇద్దరూ తోడు దొంగలు అని విమర్శించారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతామన్నారు షర్మిల. జిల్లాకు వెళతాం, గ్రామానికి వెళతామన్నారు. ప్రజలను మరింత చైతన్యవంతులం చేస్తామన్నారు. 100 రోజుల తర్వాత పాదయాత్ర కూడా చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీ కాదు.. రాజకీయ వేదిక అని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని వివరించారు. ఉచిత విద్యుత్, వైద్యం కోసం పనిచేస్తామని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా.. ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. ఆశీర్వదిస్తే నమ్మకంగా సేవ చేస్తామని తెలిపారు. ప్రతీ ఇంటికి సంక్షేమ పాలనను అందిస్తామని పేర్కొన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం పోరాడే మొండి ధైర్యం తనదని షర్మిల చెప్పారు. ఒంటరిగా దేనికోసం అయినా పోరాడుతానని చెప్పారు. తన గుండెలో నిజాయితీ ఉందన్నారు. మనసులో ప్రజలకు నమ్మకంగా పనిచేయాలనే చిత్తశుద్ది ఉందన్నారు. తనకు దేవుని దయ, ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.