దళిత్ ఎంపవర్‌మెంట్
🔹ఎస్సీలకు అదిరిపోయే శుభవార్త..
🔹ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల సాయం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలోని ఎస్సీలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దళిత సాధికారత పథకం కింద నిరుపేద దళితులకు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.1200 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్ ప్రారంభంకానుంది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు పథకం మాదిరిగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు. తొలిదశలో కొంత లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బును జమచేస్తారు. వృద్ధాప్య పించన్లు, రైతు బంధు పంపిణీ తరహాలోనే ఇది పథకం కూడా పారదర్శకంగా అమలుకానుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించారు. మరో రూ.500 కోట్లు పెంచే అవకాశముంది. వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాన్నదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా, దళిత సాధికారత పథకంపై జరుగుతున్న అఖిల సమావేశానికి ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. విపక్షాల నుంచి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎంఐఎం పార్టీ, యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి సమావేశంలో పాల్గొన్నారు. పథకం విధివిధానాల రూపకల్పన కోసం నేతలందరి అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.
దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్‌పై బీజేపీ మినహా ఇతర విపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పథకంతో నిరుపేద దళిత కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఎస్సీ సమాజానికి సీఎం కేసీఆర్ భరోసా అందించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసించారు. పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని అన్నారు. ఐతే సీఎం దళిత సాధికారత పథకానికి ఎవరు అర్హులు? వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి? నిరుపేద ఎస్సీలందరికీ ఇస్తారా? లేదంటే నియోజకవర్గానికి ఇంత మందే అనుకొని వారికి మాత్రమే ఇస్తారా? అనే వివరాలు తెలియల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పూర్తి స్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది.