PrajaPrashna

Telugu Daily Newspaper

ధనస్సు (Saggitarius)

Sagittarius(Dhanusha)

ధనస్సు (Saggitarius)

 

మూల4పాలు, పూర్వాషాఢ 4పా||లు ఉత్తరాషాఢ 1వపా|| :-ఆదాయం – 5 ఖర్చు – 5; రాజపూజ్యం – 1; అవమానం – 5

 

గురుడు: ఈ సంవత్సరమంతయు తృతీయ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు ద్వితీయ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి షష్ఠ మందు,కేతువు వ్యయ మందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం గ్రహబలం తక్కువగా ఉన్నది. ఉద్యోగమందు చిక్కులు, పదవీ గండం, అధికారుల నుండి విమర్శలు, మానసిక ధైర్యం కోల్పోవుట, ఏకార్యము తల పెట్టినా విఘ్నములు కలుగుచుండును, మనసునందు విచారము, ఆర్థికపరిస్థితి అనుకూలించకపోవడంతో అధికంగా శ్రమించవలసి రావడం, బంధువులతో విరోధము, కలహములు, శరీరము నందు పీడ కలిగించును. అధిక ధనమును ఖర్చు చేయుట, మాన,ప్రాణ హాని, వికారరూపము, శరీరము కృశించిపోవుట, ఏపనియందు మనస్సు స్థిరముగా ఉంచకపోవడం, చెడుపనులు చేయుబుద్ధి కలుగుట, స్త్రీల యందు ద్వేషము, నేత్ర సంబంధించిన బాధలు, అవమానమును, ఉపద్రవము, అనేక రకములైన పనులవలన ఖర్చులు,పిత్త-పైత్య సంబంధమైన పీడ కలుగును. ఋణము చేసి గృహము నిర్మించుట,దుష్ట స్త్రీ సాంగత్యము, కుటుంబ కలహములు,నోటిమాట వలన విపరీత సమస్యలు నిందలు వచ్చుట జరుగును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు మాటపై నిలబడకపోవుటవలన ప్రజా వ్యతిరేకత కలుగును. చేతి పనివారికి, వృత్తి వ్యాపారము చేయువారికి నష్టం అధికంగా వచ్చును, వైద్యులకు , ఉపాధ్యాయులకు గౌరవ హాని కలుగును, ఆశించిన గౌరవ ప్రతిష్టలు లభించవు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం కన్నా నష్టము అధికముగా ఉండును. మత్స్య, పౌల్డీ వ్యాపారస్తులకు నష్టం అధికంగా వచ్చును, క్రీడాకారులకు, కళాకారులకు కష్టమునకు తగిన ఫలితము రాక ఇబ్బంది కలుగును, వ్యవసాయదారులకు రెండు పంటలు మిశ్రమ ఫలితములు ఇచ్చును. విద్యార్థులు ఈ సంవత్సరం అధికంగా శ్రమించవలసి వచ్చును.

ఈ రాశి వారు ఈ సంవత్సరం శివారాధన, శివాభిషేకము, దక్షిణామూర్తి స్తోత్రము పారాయణ ,నువ్వులు, శనగలు దానము, గణపతి ఆరాధన చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : వృధా ఖర్చులు, భోజన సౌఖ్యము లేకపోవుట,కళత్ర సౌఖ్యము లేకపోవుట,కొద్దిపాటి అనారోగ్యము, వైద్యుని సంప్రదించవలసి వచ్చుట,దైవ దర్శనములు చేయుట, అధికారుల నుండి చిక్కులు,అవమానము పొందుట జరుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : కుటుంబ వృద్ధికొరకు శ్రమించుట, భార్యాభర్తల మధ్య కలహములు, జీర్ణకోశ వ్యాధి పీడ, పొరుగు వారితో కలహములు, ఏ కార్యక్రమము ప్రారంభించినా ఆటంకములు వచ్చుట, బంధుమిత్రులతో కలయిక, తల్లికి సంతోషము కలిగించు పనులు చేయుట, స్వబుద్ధి వలన కార్యలాభము కలుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఈ మాసము గ్రహస్థితి అనుకూలంగా లేదు. అన్ని విషయములలో తగు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. ముఖ్యముగా స్త్రీలకి సంబంధించిన విషయములలో జాగ్రత్తగా ఉండుట మంచిది. అనవసరముగా కలహములు, అపవాదులు వచ్చును. రక్తస్రావం, గౌరవహాని,కాస రోగము పీడించును.

ఆషాడ మాసం (11th July to 8th August) : ఈ మాసము గ్రహస్థితి అనుకూలంగా లేదు. అన్ని సమస్యలూ ఒక్కసారే

బాధించును, ఇతరులకు మంచి చేయాలనే ప్రయత్నం శతృత్వమునకు దారితీయును, ఊహించని అనారోగ్యము, దిగులు, భార్య చేత దుర్భాషలాడించుకొనుట, దుర్వార్తలు వినవలసి వచ్చును.

శ్రావణ మాసము (9th August to 7th September) : ఈ మాసము గ్రహస్థితి అనుకూలంగా లేదు. అనుకోని ఆపదలు ఏర్పడుట, ప్రమాదములు జరుగుట, పితృవర్గం వారు దైన్య స్థితి, అనారోగ్యము, ప్రతి పని అనుకూలించక బాధించును, మనో వికారము, అగౌరవము, ధననష్టము, అప్పులు చేయవలసి వచ్చుట, సోమరితనము, భోజన ఇబ్బంది కలుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఈ మాసము అనుకూలంగా ఉన్నది. అధిక శ్రమ వలన విజయము లభించును, ప్రయత్నములు అనుకూలించును, పెద్ద గొప్పవైన పనులు విజయవంతముగా పూర్తి యగును. అనారోగ్యం నుండి ఉపశాంతి, బంధు మిత్రుల కలయిక, శత్రువులపై విజయం, ఉత్తమ వస్త్రధారణ, చక్కని భోజనము లభించును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : పేరు ప్రతిష్ఠలు పెరుగుట, స్థిరాస్తి లాభములు కలుగును, చక్కని ఆదాయము, అభివృద్ధి, అనారోగ్యం నుండి ఉపశాంతి,మంచి భోజనం, గృహమునందు శుభకార్యములు నిర్వహించడం, విందులు వినోదాల్లో పాల్గొనుట, ఉద్యోగ అభివృద్ధి, పైఅధికారుల మన్నలను పొందుట,నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించును.

కార్తీకమాసము (5th November to 4th December) : ఋణము చేయవలసి వచ్చుట, దైవ సంబంధిత కార్యక్రమములో పాల్గొంటారు, ఆలయ దర్శనం, ఆదాయ వృద్ధి కొరకు ప్రయత్నించుట, బంధు, మిత్రుల సహాయ సహకారాలు పొందుట, అనవసరపు ఖర్చులు, సుగంధ ద్రవ్య సంబంధమైన వాటిని, గృహ అలంకారాలు సమకూర్చుట జరుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : ఈ మాసమునందు గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాహన ప్రమాదములు, శరీరమునకు గాయములు, మానసిక అశాంతి, శ్రమతో కూడిన ప్రయాణం, అందరితో వైరము వచ్చుట, నేత్ర పీడ, వృధా ఖర్చులు కలుగును.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : వృధా ఖర్చులు, ఆరోగ్యము దెబ్బతినుట, ధనము విపరీతంగా ఖర్చగుట, ఋణములు చేయవలసి వచ్చుట, బంధువుల మరణ వార్త వినవలసి వచ్చుట, కుటుంబ సంబంధమైన వివాదములు కలుగును.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : గృహమునందు మంగళ తోరణాలు కట్టుట, వివాహ ప్రయత్నములు ఫలించును, అనారోగ్యం నుండి ఉపశాంతి, విందులు వినోదాల్లో పాల్గొంటారు.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : సమయమునకు ధనము చేతికి వచ్చును, దానధర్మములు చేయుట, దేవాలయ దర్శనం, అలసట, అధిక శ్రమ, చక్కని గౌరవం లభించును.