Mynampally Hanumanth

 

నన్ను రెచ్చగొట్టినవ్ బండి.. ఇగ నిన్ను వదల.. – మైనంపల్లి

 

🔹బచ్చాగానివి.. వుమెనైజర్‌వి… నీ అరాచకాలన్నీ బయటపెడుతా
🔹ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా…
🔹మైనంపల్లి అంటే ఏందో చూపిస్తా…
🔹బండి సంజయ్‌పై మైనంపల్లి సంచలనం

 

మల్కాజిగిరి (ప్రశ్న న్యూస్) స్వాతంత్య్ర దినోత్సవం వేళ మల్కాజిగిరిలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే రాజుకుంది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా… దాడి జరగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెబుతున్నారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బండి సంజయ్… మైనంపల్లిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మైనంపల్లి అంతకంటే రెట్టింపు పరుష పదజాలంతో బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇప్పటినుంచి బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించారు. ‘నీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం.నిన్ను గాడిద మీద ఎక్కించి గుండు కొట్టి తిప్పేదాకా నిద్రపోడు మైనంపల్లి. నీ చుట్టు ఉన్నవాళ్లంతా కబ్జాదారులే… నాలాల మీద ఫంక్షన్ హాల్స్ కట్టారు.రేపటి నుంచి అక్రమంగా నిర్మించిన గోదాములు,ఫంక్షన్ హాళ్ల ఎదుట ధర్నా చేస్తా. వాటిని కూలగొట్టేదాకా వదలను. ఒకసారి ఎమ్మెల్సీ,నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.నేనెప్పుడూ ఇంతలా మాట్లాడలే… నన్ను రెచ్చిగొట్టినవ్… మొత్తం జిల్లాలు కదలి వస్తాయ్…’ అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో బీజేపీ కార్పోరేటర్ శ్రవణే గాంధీ బొమ్మను పగలగొట్టి రాద్దాంతం చేశాడని ఆరోపించారు. అతనో సైకో అని విమర్శించిన మైనంపల్లి… ఇంతకుముందు చాలామందిని కొట్టాడని ఆరోపించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు.

‘నీది కార్పోరేటర్ స్థాయి.. కార్పోరేటర్లపై కూడా నాకు గౌరవం ఉంటుంది… గతంలో కౌన్సిలర్‌గా కూడా ఓడిపోయావు… బీజేపీ స్టేట్ ప్రెసిడ్ంట్ ఇచ్చారు… అది ప్రూవ్ చేసుకో… ఇక్కడికొచ్చి ఎన్విరాన్‌మెంట్ మొత్తం స్పాయిల్ చేశావు. మల్కాజ్‌గిరిలో ప్రశాంతత ఉండాలనేది మైనంపల్లి ఆకాంక్ష. ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా… నువ్వొక వుమెనైజర్‌… నీ అరాచకాలన్నీ బయటపెడుతా… అసలు కామన్ సెన్స్ ఉందా నీకు.. గుండు పగలగొట్టేస్తా… నేను పిలిస్తే జిల్లాల నుంచి లక్షల మంది తరలిస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు టీఆర్ఎస్,బీజేపీ కొట్టుకుంటే కాంప్రమైజ్ చేశా… నువ్వెంత నీ బతుకెంత… బచ్చాగానివి… నీవన్నీ బయటకు తీస్తా. నేను కష్టపడి పైకొచ్చా… నాదేంది నువ్వు బయటపెట్టేది… దేనికంటే దానికి సిద్ధం. వరదల సహాయక చర్యల్లో తిరిగినప్పుడు నువ్వెక్కడున్నావ్. దమ్ముంటే రా… ఏ చౌరస్తాకు రమ్మంటే అక్కడికి వస్తా….’ అని మైనంపల్లి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘నీ దగ్గరికి నేనొచ్చానా… నాకు కులం,మతం ఫీలింగ్ లేదు… నన్ను రెచ్చగొట్టారు కాబట్టి నిన్ను నిద్రపోనివ్వను. నువ్వు ఎంపీగా ఓడిపోయేదాకా నీ వెనుక పడుతా. ఒకసారి ఎంపీగా గెలిచినందుకే అంత రెచ్చిపోతే… నేనెంత రెచ్చిపోవాలి. రా.. మైనంపల్లి అంటే ఏందో చూపిస్తా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చావని కార్పోరేటర్లే నాతో చెప్పారు.సత్తా ఉంటే రా… ఎక్కడికి అంటే అక్కడికి వస్తా.. నేనూ,నా కార్యకర్తలు చాలు నీకు.’ అని మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు,ఆరోపణలు చేశారు.

మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే జాతీయ జెండాలో భరతమాత ఫోటో ఉండటంపై వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా అది ఘర్షణకు దారితీసింది. టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్లతో దాడి చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన కార్పోరేటర్ శ్రవణ్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించడం… మైనంపల్లిపై విరుచుకుపడటం జరిగాయి. దీనికి మైనంపల్లి మరింత తీవ్రంగా రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు.