Kodandaram

 

నిరుద్యోగ సమస్య కు పరిష్కారమేది..? ప్రో.కోదండరాం

 

* మాటల గారడి తో అరచేతిలో స్వర్గం చూపిస్తు మోసం
* కుటుంబాభివృద్దికే కట్టుబడి పని చేసే ముఖ్యమంత్రి
* ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులను తడిగుడ్డతో గొంతులు కోస్తున్న సర్కార్
* దళితులు బిసి లపై హట్టాత్ గాఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది.?
* గతం లో కేసిఅర్ అంత అవినీతి, కుటుంబ ప్రీతి ఉన్న ముఖ్యమంత్రులు లేరు
* ముప్పై సంవత్సరాలు ఉద్యోగ బాద్యతలు నిర్వహించి పదవి విరమణ చేసి పెంక్షన్ పోందే వారికి ఎందుకు మళ్ళీ కంట్రాక్ట్ నియామకాలు.?
* హూజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే ఈ నక్కజిత్తుల వ్యవహరం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రం లో అవినీతి కి పెద్ద పీట వేసి ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యం దోరణి అవలంబిస్తు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న పాలకులకు తమ అనుయాయులు తప్ప ప్రజలు కనిపించడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన మోసపూరిత కుట్రలు, జిమ్మిక్కులతో అన్ని వర్గాల ప్రజలను ఉద్యోగులను, నిరుద్యోగులను తడిబట్టతో గొంతులు కోస్తు తన కుటుంభాబివృద్దకి కట్టుబడి పనిచేస్తు నిరకుశ గడీలపాలన చేస్తున్నాడని విమర్శించారు.
గత ఏడు సంవత్సరాలుగా ఫాం హౌజ్ కే పాలనను పరిమితం చేసిన కేసిఅర్ కు హట్టత్ గా ప్రజలు అందులో ముఖ్యంగా దళితులు, బిసిలపై ప్రేమ పుట్టుకు రావడం అత్యంత విడ్డూరంగా ఉందన్నారు. దీనంతటికి కారణం ముంచుకు వస్తున్నా హుజూరాబాద్ ఎన్నికలని విమర్శించారు కోదండరాం. ఎన్నికల ముందు అమలుకాని హమీలు గుప్పించి మసిపూసి మారేడు కాయచేసినట్లు దళితులు, బిసి ల ఓట్లు కొల్లగొటే మాస్టర్ ప్లాన్ లో బాగమని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలకు చేసే వాటికి అసలు పోంతన ఉండదని, గత ప్రభుత్వాల్లో పనిచేసిన ముఖ్య మంత్రులతో పోల్చి చూస్తే కేసిఆర్ అంత అవినీతి, కుటుంబ గజ్జి ఉన్న ముఖ్య మంత్రులు లేరనేది అక్షర సత్యమని దుయ్య బట్టారు. ఇక ఉద్యోగులను నిండాముంచడమే కాక నిరుద్యోగు జీవితాలతో చెలగాటం అడుకుంటు కల్లబొల్లి కబుర్లతో నాటకాలాడుతు మళ్ళీ మోసంచేసేందుకు తెరలేపాడని, కాని ప్రజలు అంతా వెర్రి వారు కారని ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని కోదండరామ్ విమర్శించారు.
అలాగే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకే తిరిగి కాంట్రక్ట్ పద్దతిన నియమిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగ  సమస్య ను ఏ విధంగా పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. దాదాపుగా ముప్పై సంవత్సరాలు పాటు ఉద్యోగ బాద్యతలు నిర్వహించి పదవి విరమణ చేసిన పెంక్షన్ పోందుతున్నా వారినే తిరిగి కాంట్టక్ట్ పద్దతిన నియమిస్తే నిరుద్యోగుల పరిస్థితేంటని ప్రశ్నించారు కోదండరాం.
ఇప్పటికైనను ప్రభుత్వం కళ్ళు తెరచి పదవి విరమణ చేసి పెంక్షన్ పోందుతు  ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి తొలంగించి ఆ స్థానాల్లో నిరుద్యోగులకు అవకాశమిస్తే కొంతవరకు ఉపాది అవకాశాలకు కూడ మార్గం ఎర్పడుతుందని ప్రభుత్వానికి సూచించారు.