పథకాల పట్టపు రాజు జగన్

🔹’జగన్ అనే నేను’ కి రెండేళ్లు
🔹పథకాల అమలులో మానవీయ కోణం
🔹సమస్యలకు వెంటనే స్పందించే గుణం
🔹ఊహించని సంక్షేమ పథకాలు.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో వైసీపి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సహచర మంత్రులు. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో రారాజుగా, పథకాల అమలులో పట్టపు రాజుగా అభివర్ణిస్తున్నారు మంత్రులు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడని, ప్రజల ఇళ్ల వద్దకే పాలన తీసుకువచ్చిన జగన్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించడం ఖాయమని మంత్రులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రజా సంక్షేమ పాలనకు రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా అమరావతిలో సీఎం హాజరయ్యే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం బయలుదేరిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 95 శాతం అమలు చేసి, హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు- నేడు వంటి పథకాలతో రాజన్న రాజ్యాన్ని ఆవిష్కరించారనే చర్చ జరుగుతోంది.

అంతే కాకుండా విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ,, వైయస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని, కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇళ్లు అందజేసి దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి మన్ననలు పొందారని మంత్రులు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయని ప్రజల్లో చర్చ జరుగుతోందని మంత్రులు గుర్తు చేసారు.అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసిపి అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసిందని మంత్రులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కష్టాలను చూసిన జగన్ మాట ఇచ్చిన విధంగానే ఇక్కడ అభివృద్ధికి కట్టుబడ్డారని ఉత్తరాంద్ర నేతలు చర్చించుకుంటన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, భావనపాడు పోర్టు, మూడు ఫిషింగ్ హార్బర్లు, నదుల అనుసంధానం వంటి కార్యక్రమాలు జిల్లాలో హైలైట్ గా నిలిచాయనే చర్చ జరుగుతోంది.అంతే కాకుండా నేరడి బ్యారేజి నిర్మాణం, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నరసన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆమదాలవలసలో వ్యవసాయ పాలిటెక్నిక్ సహా ఇంకా ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని కృష్ణదాస్ వివరించారు. రెవెన్యూ శాఖా మంత్రిగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూ రక్ష పథకం తన చేతుల మీదుగా అమలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటామనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది.