పరిశ్రమల వికేంద్రికరణపై మంత్రి కేటిఆర్ ఫోకస్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటిఆర్. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని సూచించారు. ఇప్పటికే పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని, అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలి వెళ్లేలా ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.
Related posts:
తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ది.. దేశం కన్నా రాష్ట్రమే ఎక్కువ
ఉపాధి పేరుతో నయవంచన..
మాటలకు చేతలకు పొంతనేది.? దాసోజు శ్రవణ్
కొండపల్లిలో టీడీపీ వర్సెస్ వైసీపీ
ముదురుతోన్న నీళ్ల పంచాయితీ
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
విద్యుత్ కొరత పై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్..