ఫీవర్ సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి.? ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్
🔹ఫీవర్ సర్వేతో ప్రభుత్వ డోల్లాతనం బహిర్గతం
🔹రాష్ట్రం లో అరు లక్షలపైనే కరోనా అనుమానితులు
🔹కరోనా తీవ్రతను కృత్తిమం గానే తగ్గిస్తున్నారా.?
🔹అధికారుల ప్రకటనలకు సర్వే ఫలితాలకు అస్సలు పోంతన లేదు
🔹ప్రతి జిల్లాలో ఇరవైఐదు వేల పైనే వైరస్ అనుమానితులు
🔹ప్రజల హృదయాలు గెలిచేలా అధికారులు, ప్రభుత్వం పనిచేయాలి
🔹అధికారుల నిర్లక్ష్యంతో పాతబస్తీలో లాక్డౌన్ కు తూట్లూ
(ప్రశ్న న్యూస్ బ్యూరో) కరోనా వైరస్ వ్యాప్తి దృష్టా రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే ఫలితాలు ప్రభుత్వ డొల్లాతనన్ని బహిర్గతం చేస్తున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కరోనా ఉదృతి రాష్ట్రం ప్రజల జీవన విదానంపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాల వల్ల ప్రజలు దిక్కులేని చావు చస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని, నీకు ఎదో గుర్తుకు వచ్చినప్పుడు ఫాంహౌస్ నిద్ర నుండి మేల్కొని రాష్ట్ర స్థితిగతులపై పరిపూర్ణ అవగాహన ఉన్నట్టు ఏదేదో కార్యాచరణ ప్రకటించడం దానికి నీ మంత్రి వర్గంతో పాటుగా నీ భజన బృందం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేనట్టు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పూర్తి అదుపులో ఉన్నట్టు ప్రకటన చేయడం విడ్డురంగా ఉందని దుయ్యబట్టారు దాసోజు. ప్రతిఇంట ముసుగేసి మంచం పట్టిన ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందించలేని నీ అసమర్థ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలై అపన్నహస్తాల కోరకు ఎదురు చూస్తుంటే నీ వెక్కడున్నావని, ప్రజాసమస్యల పరిష్కారం, పజారోగ్య పరిరక్షణకై ఉన్న అధికార యంత్రాగం తమ విధులను విస్మరించి పాలకుల మెప్పు కోసం పాకులాడే విధానం చూస్తుంటే విడ్డూరంగా ఉందని విమర్శించారు దాసోజు. అసలు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత త్గగిందా.? లేక కృత్తిమంగా తగ్గిస్తున్నారా.? అనే అనుమానం కలుగుతుందని ఒక ప్రక్క వైద్యారోగ్య శాఖాధికారులు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు పోటిపడుతు ప్రకటనలు గుప్పిస్తుండగా మరోప్రక్క ఫీవర్ సర్వే పలితాలు బిన్నంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో దాదాపుగా ఇరవై నుండి ఇరవైఇదువేల మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుందని ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా ప్రజలు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వే అదికారులు నిర్ధారించారని అన్నారు దాసోజు శ్రావణ్. ప్రతిరోజు కరోనా బులెటిన్ గణాంకాలకు సర్వే గణాంకాలకు మద్య ఇంత తేడాలేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ఇంతకు రాష్ట్రం లో ప్రభుత్వం పనిచేస్తుందా.? అధికారులకు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావుకు క్షేత్ర స్థాయిల్లో ఉన్న పరిస్థితులపై అవగాహన ఉందా.? అని నిలదీశారు. ప్రకటనలకు మాత్రమే పరిమితంచేసి నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అపివేసి, కరోనా చికిత్సలను కార్పోరేట్ కు తాకట్టుపెట్టి తప్పుడు ప్రచారం తో కరోనా వ్యాప్తి అదుపులో ఉందంటున్న అధికారుల సర్వేతో బయటపడుతున్న రోగాలపై సమాధానమివ్వాలని అన్నారు.
ఇక సర్వే పాల్గోంటున్న సిబ్బందికి సరైన రక్షణ సౌకర్యలు లేకుండానే ఫీల్డ్ పై పంపడంతో ఎంతోమంది వైరస్ బారిన పడి మృతి చెందారని వారి వివరాలను సైతం అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే సర్వేలో బయట పడుతున్న కరోనా అనుమానితులకు ఏం చికిత్స అందిస్తున్నారని, వారికి వెంటనే వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని విమర్శించారు. ఇక చికిత్సకు సంబందించిన కిట్స్ ఎవరికి ఇస్తున్నారని, అవసరమైన వారికి అవి ఎంతవరకు అందుతున్నాయనేదే అనుమానంగా ఉందని దుయ్యబట్టారు. కిట్ లో ఏం మందులు ఉన్నాయో, వాటి పనితీరు తీవ్రత ఏ విధంగా ఉండనుందో తెలుసుకోకుండానే నేరుగా మందులు మింగించడం ఎంత వరకు సమంజసమో అన్ని తెలిసిన వైద్యులకు తెలియదా.? అని విమర్శించారు. మీ స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రన్ని నవ్వుల పాలు చేయవద్దని పాలకులు వస్తుంటారు, పోతుంటారు కావున వారి మెప్పుకు తాపత్రయ పడే అధికారులు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకునేటట్లు పనిచేసి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని హితవు పలికారు దాసోజు శ్రావణ్. ఇదిలా ఉండగా లాక్డౌన్ అమలును మన పోలీస్ వ్యవస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పాత నగరంలోని సైదాబాద్ సంతోష్ నగర్, బాబానగర్, చంద్రాయన్ గుట్ట తదితర ప్రాంతాల్లో నిబంధనలకు తూట్లు పెడుతు బాహటంగా రోడ్లపై తిరుగుతున్న జనాలు పోలీసులకు కనపడడం లేదా.? లేక అక్కడ జన సమూహలను నియంత్రించేందుకు ఏవైనా శక్తులు అడ్డుపడు తున్నాయా అని విమర్శించారు. రాష్ట్ర డిజిపి, కమీషనర్ పాతనగరంలో ఆకస్మిక పర్యటనలు జరిపి క్షేత్ర స్థాయి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు.