PrajaPrashna

Telugu Daily Newspaper

మకరం (Capricorn)

Capricorn(Makara)

మకరం (Capricorn)

 

ఉత్తరాషాఢ 2,3,4పా|| శ్రవణము 4 || ధనిష్ట 1,23|| :-ఆదాయం – 8 ఖర్చు – 14; రాజపూజ్యం – 4 అవమానం – 5

 

గురుడు: ఈ సంవత్సరమంతయు ద్వితీయ మందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు జన్మ మందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి పంచమ మందు,కేతువు ఏకాదశమందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు గోచరించుచున్నవి. దానధర్మములు చేయుట, ప్రాచీన ఆలయ దర్శనం చేసుకొనుట, పూజలు క్రతువులలో పాల్గొనుట, కళత్ర సుఖము, ధనాదాయవృద్ధి, శత్రు బాధలనుండి విముక్తి, మాటలతో ఇతరులను ఆకర్షించుట, పుణ్య కార్యక్రమముల నిమిత్తం ధనముఖర్చు చేయుట, సంఘము నందు కీర్తి, గౌరవము, గౌరవమైన ఉద్యోగము, అధికారుల ప్రశంసలు, అగ్ని విషయము వలన ఇబ్బందులు, స్నేహితులు, బంధువర్గము వారితో వివాదములు, దూర దేశ ప్రయాణము ఫలించును, ఇష్టమైన వారి వియోగము,సంతాన రీత్యా ఇబ్బందులు,వక్ర మార్గముల ద్వారా ధనము సంపాదించుట, ప్రాచీన వస్తువులు సేకరించుట, నూతన గృహము, అధిక ఖర్చులు, వివాహ ప్రయత్నములు ఫలించుట, గర్భస్రావము, నూతన ఉత్సాహంతో ప్రతి కార్యక్రమం పూర్తి చేయుట, శరీర ఆకృతి మారుట వలన మన స్థాపమునకు గురియగుట జరుగును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు వాగ్దానములు నెరవేర్చి ప్రజల మన్నలను పొందుదురు. చేతి పనివారికి, వృత్తి వ్యాపారము చేయువారికి లాభము కలుగును, వైద్యులకు ,ఉపాధ్యాయులకు అధిక గౌరవం కలుగును, ఆశించిన గౌరవ ప్రతిష్టలు లభించును, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభ నష్టములు సమముగా ఉండును. మత్స్య, పౌల్డీ వ్యాపారస్తులకు నష్టం అధికంగా వచ్చును, క్రీడాకారులకు, కళాకారులకు కష్టమునకు తగిన ఫలితము లభించును, వ్యవసాయదారులకు రెండు పంటలు మిశ్రమ ఫలితములు ఇచ్చును, విద్యార్థులు ఈ సంవత్సరం అధిక శ్రమ వలన విజయము లభించును.

ఈ రాశి వారు ఈ సంవత్సరం శివారాధన, శివాభిషేకము,మృత్యుంజయ జపము, నువ్వులు దానము,శని స్తోత్రము,సుందరకాండ పారాయణ చేయుట, దుర్గాదేవి ఆరాధన చేయుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలించును,పదవి లాభము, ఆకస్మిక ధనలాభం, మంచి ఆరోగ్యం, మానసిక ఉత్సాహం, పుత్ర సౌఖ్యము, బంధు మిత్రులతో సంతోషముగా కలసి శుభ కార్యక్రమంలో పాల్గొనుట,వస్త్ర వ్యాపారులకు నష్టం కలుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : గొప్పవారితో స్నేహము మరియు వారి వలన లాభము చేకూరును, బంధువుల నుండి బహుమతులు పొందుట, స్త్రీలతో సంభాషణ యందు ప్రీతి, బంధు, మిత్ర, పుత్ర, భార్య లతో విద్యా గోష్టి, ప్రయత్నించిన కార్యమును సాధించుట, శరీర సుఖముగా ఉండుట, సంతోషము,ధనాదాయము కలుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July): శ్రమతో కూడిన ప్రయాణములు, ఇరుగుపొరుగు వారితో ద్వేషము, భార్యాభర్తల మధ్య గొడవలు, బంధువులతో శత్రుత్వము, కుత్సితమైన మాటలు, ప్రయత్నించిన కార్యములు శ్రమతో సాధించుట, స్త్రీలద్వార పెద్ద ఉపద్రవములు, ప్రేమ విఫలమగుట,అపవాదములు కలుగును.

ఆషాడ మాసం (11th July to 8th August) : అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చాలా ఉత్సాహంగా కనబడుట, గృహ నిర్మాణమునకు అనుకూలమైన స్థలము సేకరించుట, స్త్రీల వలన ఉన్న సమస్యలు తగ్గుముఖము పట్టును, ధనలాభము, కార్యభంగము, అలసట,ఎక్కువ సమయం మౌనముగా గడుపుట జరుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : ఈ మాసము మిశ్రమ ఫలితములు కలుగును, రోజు విడిచి రోజు ఏదో ఒక రకమైన శరీర బాధ, ఎక్కువగా నిరుత్సాహం, తాత్కాలికమైన ఉత్సాహము, ఆనందం కలుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : అవమానములు, ఆపదలు ఏర్పడుట, ప్రమాదములు జరుగుట, దైవపూజలో పాల్గొనుట, పితృవర్గం వారు దైన్యము, క్రియా విషయ బాధలు, శారీరక ధాతు బలం తగ్గుట,ఉద్యోగము నందు అధిక శ్రమ, దొంగల భయము, చిరాకు కలిగించును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : బంధు మిత్రుల కలయిక, విందులు వినోదాల్లో పాల్గొంటారు, దానధర్మములు చేయుట, ఉద్యోగ అభివృద్ధి, కష్టముతో ప్రారంభించిన పని విజయవంతమగును, ప్రయత్నములు ఫలించును, సంఘములో గౌరవము, తగాదాల వ్యవహారములో విజయము సాధిస్తారు.

కార్తీకమాసము (5th November to 4th December) : స్థిరాస్తి లాభము, ప్రాచీన ఆలయదర్శనము, భగవద్భక్తి, సాధువుల దర్శనము, అనారోగ్యం నుండి ఉపశాంతి, గౌరవము, మంచి భోజనము, గృహమునందు శుభకార్యములు, నూతన ఉత్సాహంతో కార్యములు పూర్తి చేయుదురు.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : ఆదాయానికి మించి ఖర్చులు, ఊహించని విధంగా ఆపదలు, కొద్దిపాటి అనారోగ్యము, మనో విచారము కలుగును.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : శరీరము బలహీనపడుట మరియు గాయములు,వాహనప్రమాదములు, శిరోవేదన,ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలెను.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : అనారోగ్య సమస్యలు, ధనలాభము, అధికముగా ద్వేషము, సంతానమునకు ఆరోగ్య ఇబ్బందులు, కార్యభంగము, అలసట,ఎక్కువ సమయం వృధగా గడిచిపోవును.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : మంచి వారితో కలయిక,స్త్రీ సుఖము, ఉల్లాసము, గృహ అలంకారములు సమకూర్చుట,శత్రు బాధ, నూతన ఉద్యోగ ప్రయత్నము, అవమానము జరుగును.