మరో 20 ఏళ్లు మాదే అధికారం

 

🔹త్వరలో పేదలబంధు – కేసీఆర్
🔹సెప్టెంబర్ 2న ఢిల్లీలో పార్టీ ఆఫీస్ శంకుస్థాపన
🔹హుజూరాబాద్ ఉపఎన్నిక చిన్న విషయమన్న కేటీఆర్
🔹తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నకేటీఆర్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో మర 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాలని చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందున దళిత బంధు పథకం తెచ్చామని, ప్రాధాన్యత క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదబంధు కూడా తెస్తామని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలన్నారు. నవంబర్ మొదటి వారంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

నవంబ‌ర్ మొద‌టివారంలో పార్టీ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ద‌ళిత బంధుపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌న్నారు. ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ద‌ళిత‌బంధును ఉద్య‌మంలా చేయాల‌న్నారు. వ‌చ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేసుకోబోతున్న‌ట్లు తెలిపారు. ద‌శ‌ల‌వారీగా స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే కొత్త జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మిస్తామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, సుమారు రెండున్నరగంటలపాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రస్తావనే రాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాక హుజూరాబాద్ ఉపఎన్నికపై వ్యూహరచన చేస్తామన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తమకు చాలా చిన్న విషయమని అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కంచుకోట అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేదేమీ లేదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందన్నారు. దళిత బంధు అమల్లో విపక్షాలు కూడా పాలు పంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు, బీసీ బంధు అమలు చేసి చూపాలన్నారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్న దళితులను ఆవుకోవడం అవసరమని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం టీఆర్ఎస్ పార్టీదేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 32 జిల్లాల్లో విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 24 నుంచి 25 జిల్లాల్లో పార్టీ కార్యాలయల నిర్మాణం పూర్తి అయ్యిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు సెప్టెంబర్ 2న కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుందని అన్నారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరవుతారు అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న 12 వేళ 769 గ్రామ కమిటీల నిర్మాణము, 3854 వార్డు కమిటీల నిర్మాణం పూర్తి అవుతుంది అని స్పష్టం చేసారు. కొత్తగా జిల్లా కమిటీల ఏర్పాటు, సరికొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ లోనే సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.