PrajaPrashna

Telugu Daily Newspaper

మహా శివరాత్రి 2022

మహా శివరాత్రి 2022

మాహా శివరాత్రి అంటే ఏమిటి?

అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.

తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.

మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.  శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు. తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

అసలు రోజున ఏం చేయాలి? 

శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.

ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వదళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.

ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.

కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి.

మహా శివరాత్రి మంగళవారం, మార్చి 01, 2022 ముఖ్యమైన సమయాలు.

మహా శివరాత్రి 2022

చతుర్దశి తిధి ప్రారంభం: మార్చి 01, 02:39 AM.
చతుర్దశి తిధి ముగుస్తుంది: మార్చి 02, 12:55 AM.
పూజ సమయం: మార్చి 02, 12:05 AM to మార్చి 02, 12:55 AM (50 Mins)
మహా శివరాత్రి పరాన సమయం
మొదటి ప్రహర్ పూజ సమయం: మార్చి 01, 06:02 PM to మార్చి 01, 09:07 PM
రెండో ప్రహార్ పూజ సమయం: మార్చి 01, 09:07 PM to మార్చి 02, 12:11 AM
మూడవ ప్రహార్ పూజ సమయం: మార్చి 02, 12:11 AM to మార్చి 02, 03:16 AM
నాలుగో ప్రహార్ పూజ సమయం: మార్చి 02, 03:16 AM to మార్చి 02, 06:21 AM

ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

Know More Shiva Panchakshara Stotram, Shiva Tandava StotramDaridrya Dahana Shiva StotramShivaaya Gurave NamahaShiva Dwadasa Nama Stotram24 Shiva Abhishekam.

శివుడుకి వివిధ రకాల అభిషేకాలు, మరియు వాటి ఫలితములు

1. పుష్పోదకము చేత అభిషేకించిన భూ’లాభము  కలుగును.

2. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.

3. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును

4. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.

5. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

6. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

7. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

8. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.

9. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

10. భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

11. మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును.

12. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

13. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 

14. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.

15. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

16. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 

17. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.

18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 

21. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

22. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.

23. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

24. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.