Dasoju Sravan

 

మాటలకు చేతలకు  పొంతనేది.? దాసోజు శ్రవణ్

 

* ఉదారంగా డబ్బు పంచితే ధనవంతులు కారు
* ప్రజల్లో కష్టపడే తత్వం పెంపోందాలి
* నాయకుల కుట్రలకు బలికా వద్దు-అప్రమత్తంగా ఉండాలి
* ఏ ప్రభుత్వం వచ్చిన పదవులు పాత వారికే
* ఉదయ ఒక పార్టీ సాయంత్రం మరోపార్టీ ఇది నేటి నాయకుల తీరు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఇచ్చిన హమీలు గాలికి వదిలి క్షణ క్షణం కుట్రలు కుతంత్రాల తోప్రజలను మోసగించే తెలివి తేటలు ఉంటే రాజకీయ రంగంలో అత్యద్బుతంగా రానిచ గలుగుతారని నేటి నాయకులు స్పష్టం చేస్తున్నారు. మానవ విలువలకు తిలోదకాలు ఇచ్చి మమకారాలను చంపుకోని తన మన తారతమ్యం లేకుండా మోసగించుకుంటు డబ్బు కుడగట్టుకోవడమే పరమావదిగా మారిన ఈ రోజులో సామాన్య ప్రజలకు పూట గడవడం గగణమై పోతుందని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి  దాసోజు శ్రవణ్ విచారం వ్యక్దం చేసారు. రోజు రోజుకు ప్రజల్లో కష్ట పడే మనస్థత్వం సడలి పోతుందని దీనికి కారణం నేటి స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలేనన అధికార దర్పానికి అలవాటు పడిన మన పాలకులు విచ్చలవిడిగా ఆచరణకు నోచుకోని హమీలను గుప్బిస్తు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తు విచ్చల విడిగా సంక్షేమ పథకాల ముసుగు లో లక్షలకు లక్షలు ఉదరంగా పంచి ఓట్లు కొంటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తు వింత పోకడలకు తెర లేపుతున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం లో అప్రజాస్వామిక కార్యక్రమాలు మితిమీరాయని ఇది దేశ సార్వభౌమత్వాని కే కళంకం కల్గింంచేవిగా ఉన్నాయని విమర్శించారు దాసోజు. నాయకులకు పేదలపై నిజమైన ప్రేమ ఉంటే స్వతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికి పేదలు పేదలుగానే ఉన్నారని ధనికులు మాత్రం  ఆకాశానికి ఎకబాకుతున్నారు మరి గత 75 సంవత్సరాలు గా పేదల పేరు పై ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి పోతుందో..? ఎవరు బాగుపడుతున్నారో..? పాలకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసారు. పేదరికం నిర్ములనకు ఉధారంగా డబ్బు పంచడంతో అందరు ధనికుల్లా మారరని సరైన ప్రణాళికలతో ఉపాధి సంక్షేమ పథకాలు అమలుచేస్తు ప్రజలోకష్టపడే తత్వాన్ని పెంపోందించాలని ఇది రాష్ట్ర, దేశ పటిష్టానికి ఉతమిస్తుందని దాసోజు శ్రవణ్ హితవు పలికారు. ఎన్నికలు వస్తేనే ఆరచేతి లో స్వర్గం చూపి ఓట్లు దండుకొని లబ్దిపొంది పబ్బం గడుపుకునే స్వార్థ  రాజకీయ నాయకులు ఉన్నంత వరకు రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నాంర్థకమేనని ఆవేదన వ్యక్తం చేసారు. అక్రమ సంపాదనకు, అధికార దర్ఫానికి  అలవాటు పడి దనిక రాష్ట్రన్ని సంక్షేమ పథకాల నీడలో దోచుకుంటు అఫ్పుల కుప్పుగా మార్చి ప్రజల నెత్తిన అప్పుల బారం మోపడం ఎంత వరకు సమంజసమని దాసోజు ప్రశ్నించారు. ఇక తమ దోపిడికి అనుకూలంగా రాజ్యాంగానికి సైతం సవరణలు చేసి తమ ఇష్టానుసారం పాలన చేస్తు ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక నేడు రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ది లోపించిందని  మాటలకు చేతలకు పోంతన లేదని, ఇది సామాన్యులు బ్రతికే కాలం కాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కల్లబోల్లి కబుర్లు చేప్పె నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవసరానుగుణంగా అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులను మట్టి కరిపించాలని సూచించారు. ఇక ఉసరవెల్లి రంగులు మార్చినట్లు ఉదయం ఒక పార్టీ లోఉంటే సాయంత్రం మరోపార్టీ లోకి మారి ఏ ప్రభుత్వం వచ్చినా పదవుల్లో వారే ఉండడం తో మార్పు ఏలా వస్తుందని, ప్రజావ్యతిరేక పాలనకు విసుగెత్తి ప్రభత్వాలకు చెంప చెల్లు మనే తీర్పు ఇచ్చినను  నాయకుల కుట్రలకు ప్రజలు తెల్లమొఖాలు వేసుకోవాల్సి న  పరిస్థితులు దాపురించాయని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కుట్రలు కుతంత్రాలకు బలై రోజురోజుకు అడుగంటి పోతున్న  మానవ విలువలను కాపాడు కునేందుకు ప్రజలంతా ఏకమై అహంపూరిత అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని టీ పీసీసీ కార్యదర్శి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.