Malla Reddy

 

మారని మల్లారెడ్డి..

 

🔹ప్రెస్‌మీట్‌లో తొడగొట్టిన తెలంగాణ మంత్రి..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ మంత్రుల్లో మల్లారెడ్డిది ప్రత్యేక శైలి. ఇంకా చెప్పాలంటే ఆయన వివాదాలు కొనితెచ్చుకుంటారు. గతంలో ఓ సర్పంచ్‌ను బెదిరిస్తున్నట్టుగా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆ తరువాత మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. అయితే ఆ తరువాత మల్లారెడ్డి ఎక్కువగా వార్తల్లోకి రాలేదు. అయితే తాజాగా మరోసారి ఆయన తనదైన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లిలో చేసిన విమర్శలకు మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్‌లోనే తొడగొట్టి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ, బట్టేవాజ్ అని మల్లారెడ్డి కామెంట్ చేశారు. తాను ఎపుడూ బ్రోకర్ దందా చెయ్యలేదని వివరణ ఇచ్చారు. తాను రాజీనామా చేస్తానని.. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి ప్రజల్లోకి వెళదామన్న మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డి మళ్లీ ఎంపీగా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. మూడు చింతలపల్లిలో రెండు రోజుల పాటు దీక్ష చేసిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మల్లారెడ్డి తప్పుబట్టారు. 62కోట్ల రూపాయలతో మూడు చింతలపల్లిలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. అసలు మూడు చింతలపల్లి అనే కొత్త మండలం ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమే అని అన్నారు. మూడు చింతలపల్లి లో సమస్యలు లేవు కాబట్టే రేవంత్ రెడ్డిని రావొద్దని అని గ్రామస్థులు ప్లకార్డులు చూపించారని వ్యాఖ్యానించారు. మూడు చింతలపల్లి లో ఉన్న అభివృద్ధి కొడంగల్ లో ఉందా? అని ప్రశ్నించారు. తాను లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పుకొచ్చారు. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని మండిపడ్డారు. మల్లారెడ్డి కాలేజీలపై పార్లమెంట్‌లో రేవంత్ అడిగితే కేసులు లేవని క్లిన్ చీట్ ఇచ్చిందని గుర్తు చేశారు. తాను భూకబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు ఫస్ట్ సంతకాలు అని వాగ్ధానాలు చేస్తుండని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా.. తాను తన పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రేస్ పార్టీ దివాళా తీసిన పార్టీ అని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఖబర్ధార్ అని హెచ్చరించారు.