మాస శివరాత్రి 2023
శివరాత్రి అంటే ఏమిటి?
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.
మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు. తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
Know More Shiva Panchakshara Stotram, Shiva Tandava Stotram, Daridrya Dahana Shiva Stotram, Shivaaya Gurave Namaha, Shiva Dwadasa Nama Stotram, 24 Shiva Abhishekam.
అసలు ఈ రోజున ఏం చేయాలి?
శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.
ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వదళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.
ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.
కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి.
Maha Shivaratri Important Timings on Saturday, February 18, 2023
Chaturdashi Tithi Begins: Feb 18, 08:02 pm.
Chaturdashi Tithi Ends: Feb 19, 04:18 pm.
Nishita Kaal Puja Time: Feb 19, 12:15 am to Feb 19, 01:05 am (50 Mins)
1’st Prahar Puja Time : Feb 18, 06:20 pm to Feb 18, 09:30 pm
2’nd Prahar Puja Time : Feb 18, 09:30 pm to Feb 19, 12:40 am
3’rd Prahar Puja Time : Feb 19, 12:40 am to Feb 19, 03:50 am
4’th Prahar Puja Time : Feb 19, 03:50 am to Feb 19, 07:00 am
Maha Shivaratri Parana Time : Feb 19, 07:00 am to Feb 19, 04:18 pm
శివుడుకి వివిధ రకాల అభిషేకాలు, మరియు వాటి ఫలితములు
1. పుష్పోదకము చేత అభిషేకించిన భూ’లాభము కలుగును.
2. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
3. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
4. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
5. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
6. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
7. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
8. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
9. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
10. భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
11. మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును.
12. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
13. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
14. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
15. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
16. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
17. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
21. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
22. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
23. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
24. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
Below the list of Masik Shivaratri in 2023 as per South India Timing’s.
Masik Shivaratri in January 2023 |
|
Date : January 20, 2023 (Friday)
Puja Time : Jan 21, 12:05 am to Jan 21, 12:59 am (54 Mins) |
⚫ (Pushya) Krishna Chaturdashi Tithi Begins : Jan 20, 09:59 am Tithi Ends : Jan 21, 06:17 am |
Maha Shivaratri & Masik Shivaratri in February 2023 |
|
Date : February 18, 2023 (Saturday)
Puja Time : Feb 19, 12:09 am to Feb 19, 01:00 am (51 Mins) |
⚫ (Magha) Krishna Chaturdashi Tithi Begins : Feb 18, 08:02 pm Tithi Ends : Feb 19, 04:18 pm |
Masik Shivaratri in March 2023 |
|
Date : March 20, 2023 (Monday)
Puja Time : Mar 21, 12:05 am to Mar 21, 12:52 am (47 Mins) |
⚫ (Phalguna) Krishna Chaturdashi Tithi Begins : Mar 20, 04:55 am Tithi Ends : Mar 21, 01:47 am |
Masik Shivaratri in April 2023 |
|
Date : April 18, 2023 (Tuesday)
Puja Time : Apr 18, 11:58 pm to Apr 19, 12:42 am (44 Mins) |
⚫ (Chaitra) Krishna Chaturdashi Tithi Begins : Apr 18, 01:27 pm Tithi Ends : Apr 19, 11:23 am |
Masik Shivaratri in May 2023 |
|
Date : May 17, 2023 (Wednesday)
Puja Time : May 17, 11:57 pm to May 18, 12:38 am (42 Mins) |
⚫ (Vaishakha) Krishna Chaturdashi Tithi Begins : May 17, 10:28 pm Tithi Ends : May 18, 09:42 pm |
Masik Shivaratri in June 2023 |
|
Date : June 16, 2023 (Friday)
Puja Time : Jun 17, 12:02 am to Jun 17, 12:42 am (40 Mins) |
⚫ (Jyeshtha) Krishna Chaturdashi Tithi Begins : Jun 16, 08:39 am Tithi Ends : Jun 17, 09:11 am |
Masik Shivaratri in July 2023 |
|
Date : July 15, 2023 (Saturday)
Puja Time : Jul 16, 12:07 am to Jul 16, 12:48 am (41 Mins) |
⚫ (Ashadha) Krishna Chaturdashi Tithi Begins : Jul 15, 08:32 pm Tithi Ends : Jul 16, 10:08 pm |
Masik Shivaratri in August 2023 |
|
Date : August 14, 2023 (Monday)
Puja Time : Aug 15, 12:04 am to Aug 15, 12:48 am (43 Mins) |
⚫ (Adhika Shravana) Krishna Chaturdashi Tithi Begins : Aug 14, 10:25 am Tithi Ends : Aug 15, 12:42 pm |
Masik Shivaratri in September 2023 |
|
Date : September 13, 2023 (wednesday)
Puja Time : Sep 13, 11:54 pm to Sep 14, 12:40 am (46 Mins) |
⚫ (Shravana) Krishna Chaturdashi Tithi Begins : Sep 13, 02:21 am Tithi Ends : Sep 14, 04:48 am |
Masik Shivaratri in October 2023 |
|
Date : October 12, 2023 (Thursday)
Puja Time : Oct 12, 11:43 pm to Oct 13, 12:33 am (50 Mins) |
⚫ (Bhadrapada) Krishna Chaturdashi Tithi Begins : Oct 12, 07:53 pm Tithi Ends : Oct 13, 09:50 pm |
Masik Shivaratri in November 2023 |
|
Date : November 11, 2023 (Saturday)
Puja Time : Nov 11, 11:39 pm to Nov 12, 12:32 am (53 Mins) |
⚫ (Aswayuja) Krishna Chaturdashi Tithi Begins : Nov 11, 01:57 pm Tithi Ends : Nov 12, 02:44 pm |
Masik Shivaratri in December 2023 |
|
Date : December 11, 2023 (Monday)
Puja Time : Dec 11, 11:47 pm to Dec 12, 12:42 am (55 Mins) |
⚫ (Kartika) Krishna Chaturdashi Tithi Begins : Dec 11, 07:10 am Tithi Ends : Dec 12, 06:24 am |
** ** **