మీకో న్యాయం పేదవారికో న్యాయమా..?
🔹 కేసీఆర్‌కు ఎన్ని సార్లు చెప్పిన చీమ కుట్టినట్టు ఉండదు…
🔹కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం…
సిరిసిల్ల (ప్రశ్న న్యూస్ ) తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కరోనా బాధిత కుటుంబాలను కలిసేందుకు షర్మిల పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలను వైఎస్ షర్మిల కలిశారు. వైయస్ షర్మిల మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా వైయస్ఆర్ లా ఆలోచించలేదని పేదవాడికి జబ్బు వస్తే కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ తెచ్చారని ఆమె అన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందుతుంద అని పేద వారి కోసమే ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. కరోనా వల్ల కుటుంబాలు రోడ్డుమీద పడ్డాయని భర్తలను కోల్పోయిన భార్యలు తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో మంది దుర్భర బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారని, ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎంతోమంది పేదవారు అప్పుల పాలయ్యారని కరోనా ను ఆరోగ్యశ్రీలో చేరించినట్లయితే ఎంతో మంది పేదలు అప్పులపాలు అయ్యే వారు కాదని అన్నారు. బ్రతికితే చాలు అంటూ లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి అప్పులపాలవుతున్నారు అని అన్నారు. కెసిఆర్ కి కరోనా వస్తే యశోద హాస్పిటల్ కి వెళ్తారు, కానీ ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళద్దు అంటూ కెసిఆర్ అంటారు. గవర్నమెంట్ హాస్పటల్ కు వెళ్లాలని అంటాడు గవర్నమెంట్ హాస్పటల్ కి వెళితే బ్రతుకుతాం అన్న ఆశ లేక ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రి వైపు వెళ్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రి లో ఆక్సిజన్ ఉంటే బెడ్ లేక బెడ్లు ఉంటే ఆక్సిజన్ లేక డాక్టర్ లేక గవర్నమెంట్ ఆసుపత్రి పైన నమ్మకం ప్రజలకు లేకుండా ఉంది. కెసిఆర్ కు నమ్మకం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేవాడిని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వారు కాదని అన్నారు.
కెసిఆర్ కు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా ప్రజల ప్రాణాలంటే విలువ లేదా అని అన్నారు. కరోనా బారిన పడ్డ ప్రతి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ అనేది దిక్కుమాలిన పథకమని కెసిఆర్ అన్నారు. మరి ఆ దిక్కుమాలిన పథకములో కరోనా ను ఎందుకు చేర్చారని వైయస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ అనేది 26 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుందని అందరికీ వర్తించదని అన్నారు. బైక్ ఉన్న కారు ఉన్న ఇటుకలతో కట్టిన ఇల్లు ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద అనర్హులుగా అవుతారు. కానీ 80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి. అరవై లక్షల కుటుంబాలకి లబ్ధి జరగదని అన్నారు. కెసిఆర్ పద్ధతి అసలు బాగాలేదు ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి బాధలు, కన్నీళ్లు చూస్తే కదా తెలిసేది అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ లో కాదు ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కెసిఆర్ కు ఎన్ని సార్లు చెప్పిన చీమకుట్టినట్టు కూడా లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే అని వైయస్ షర్మిల అన్నారు.అనంతరం పదిర గ్రామంలో మృతి చెందిన వైయస్సార్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.