మీనం (Pisces) 2022-2023

మీనం (Pisces) 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Pisces/Meena/మీనరాశి

(పూర్వాభాద్ర: 4 పాదము, ఉత్తరాభాద్ర: 1,2,3,4 పాదములు, రేవతి: 1,2,3,4 పాదములు)
(ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 01 అవమానం – 07)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి జన్మరాశి సంచారము, తామ్రమూర్తి సామాన్య ఫలములను కలుగజేయును. బృహస్పతి స్వక్షేత్రమైన మీనరాశిలో ప్రవేశం ఈ రాశివారిపై అనేక శుభపరిణామాలకు నాంది పలుకుతుంది. వ్యక్తులయొక్క ఆధ్యాత్మిక స్థాయి పతాకస్థాయికి తీసుకు వెళుతుంది. అన్ని మంచి లక్షణాలను పెంపొందింప చేస్తుంది. సహనంతో, ఉదారంగా మరియు నైతికంగా ఉండేట్టు చేస్తుంది.

శరీరసౌష్ఠవం, వాహనం మరియు స్వగృహ నిర్మాణాలు లాంటి విషయములు ఒక స్థాయికి చెందిన విషయాలే, అంతకన్నా సంతానం విషయంలో తలెత్తుకుని ఆనందంగా ఉండటం, ముఖవర్చస్సు పెంచుకోవడం, జ్ఞానస్థాయి పెరగడం అధ్యాత్మికంగా ఉన్నతులవడం జరుగుతుంది. శాంతం, సహనం మీ ఆయుధంగా విజయాలు సాధిస్తారు. సరైన విశ్లేషణలు మరియు ఆలోచనల తర్వాత మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధ్యానం మరియు యోగా మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యారంగం లాంటి ఉన్నతస్థానాలలో అందరికీ సమన్వయకర్తగా రాణిస్తారు. అందరికీ ప్రయోజనకారిగా సహాయపడుతూ ఉంటారు. మీతో పనిచేయువారికి సైతం ప్రోత్సాహమిస్తూ మీ సంస్థ ఉన్నతికి పాటుపడతారు.

ఇతర సంస్థలలోనూ మీ వ్యక్తిత్వానికి మీపై ఉద్యోగులు క్రింది ఉద్యోగులలో సైతం మంచి గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగం అవకాశం ఉంది. మీరు ఖాళీగా ఏ పనిచేయకుండా ఉండరు ప్రయోజకులవుతారు. వ్యాపారస్తులకు రోజువారీ లాభాలు పెరుగుతాయి. ఇదే సమయంలో తల నరములు, కండరముల నొప్పులు మిమ్ములను తరచూ వేధిస్తూ ఉంటాయి. రియల్‌ ఎస్టేటు లాంటి నిర్మాణాత్మక రంగాలలోని వారికి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. ఏ స్థాయిలో ఎవరు ఏ వృత్తి చేసినా దాని పరమార్ధం ఇతరులకు అందేలా సహాయపడేలా చేయగల్గుతారు.

Know More Pisces/Meena/మీనరాశి

శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి వ్యయస్థానమందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించి మరలా వక్రించి లాభస్థానమున సంచరించును. ప్రారంభమున అజీర్ణము, స్థిమితము లోపించినను జూలై నెల మధ్య నుండి రోగములు లేక దేహారోగ్యము చక్కబడును. అర్ధలాభము ప్రీ పుత్ర సుఖ వర్ధనము, మనో నైర్మల్యము, ఇష్టార్ధసిద్ధి కలుగును. మొత్తము మీద ఈ సంవత్సరము గోచారస్థితి అనుకూలము. నల్లటి పంట పైరులతో వికసించు భూములను కొనుగోలుజేసి, అభివృద్ధి చెందుదురు. రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా ద్వితీయ, అష్టమస్థానములందు సువర్ణమూర్తులుగా సంచరింతురు.

పూర్వాభాద్రవారు వివాహ, సంతాన విషయమై చింత, ఉత్తరాభాద్రవారికి వ్యాపారవృద్ధి, రేవతి నక్షత్రము వారికి సర్వజన వశీకరణ, పచ్చరాయి ఉంగరమున ధరించుట మంచిది.

వీర్మి అదృష్ట సంఖ్య – ‘3’. 1,2,5,9 తేదీల సంఖ్యలు ఆది సోమ గురు వారములతో కలసిన మరింత మేలు జరుగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: జన్మరాశిలో రవి ప్రభావము వలన ఇతరులపై క్రోధము ఆవేశము. ఇతరులపై ద్వేషము తగ్గించుకొనుట మంచిది. ఇంట శుభకార్య భారము, ధనము కొరకు ప్రాకులాడుట, ధైర్యముతో ముందుకు సాగెదరు, ధనాగమము. ప్రతీపనిలోనూ వత్తిడిని అధిగమిస్తారు.

మే: శుభకార్య పరంపర మొదలవుతుంది. గృహమున మంగళతోరణములు బంధుమిత్ర సమాగమము, శుభవ్యయము, మిత్రుల ప్రశంసలు మీరు చేసే ప్రతీ పని కలసివస్తుంది. చీటికి మాటికి ఇతరులపై క్రోధము పూనుట మంచిది కాదు.

జూన్‌: ముఖవర్చస్సుతో ఆకర్షణగా యుండి కార్యభారాన్ని అలసట లేక తేజస్తత్వముతో జయించుకుని రాగల్గుతారు. నిరుద్యోగులకు అనుకూల సమయము, మిలటరీ, పోలీసు సంబంధ ఉద్యోగావకాశములు మిమ్ములను వరించును.

జూలై: ఊహించిన దానికన్నా అధిక ధనవ్యయమైననూ శుభకార్యం కలసిరావడం వలన మీకు ఆనందం కలుగుతుంది. వ్యయప్రయాసలను లెక్కచేయరు. గృహనిర్మాణాలు ఆలస్యమవుతాయి. దైవధ్యానం, ధర్మ నిష్ట కలుగుతుంది.

ఆగస్టు: విద్యలచే వినోదము కల్గును. ఉన్నత విద్యలలోనివారు రాణించెదరు. పరిశోధన రంగములోని ప్రముఖులు అత్యంత ప్రతిభాపాటవములు ప్రదర్శించెదరు. విద్యావేత్తలకు ప్రతిభా పురస్కారములు లభించును. గుర్తింపు వస్తుంది.

సెప్టెంబర్‌: మలేరియా జ్వరములాంటి విషదోమల ప్రభావం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరం శోభ తగ్గుతుంది. జన్మగురుడు, తృతీయ కుజుని ప్రభావము వలన ఆరోగ్యం వెంటనే మెరగవుతుంది. బుద్ధిమాంద్యం తగ్గుతుంది. ధనమునకు లోటుండదు.

అక్తోబర్‌: శరీర ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు కల్గుతాయి. దైవ సంబంధ కార్యాల్లో ఆనందం అనుభవిస్తారు. సంతానం విద్యా విషయాల్లో ముందంజ వేస్తారు. కళత్ర ఆరోగ్యం జాగ్రత్త అవసరం. ఇబ్బంది లేదు.

నవంబర్‌: వీసా మొదలగునవి మంజూరు విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. సముద్రములపై ప్రయాణించి ఇతరదేశాలు సందర్శించు అవకాశము వస్తుంది. ధనము నిల్వ ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కల్గుతుంది.

డిసెంబర్‌: కుటుంబములో పెద్దలను గౌరవించుట వారి ఆశీస్సులు పొందుట, కులాచారము జరుపుట, దైవ బ్రాహ్మణ భక్తి గ్రామ దేవతలను సందర్శించుట, మనోనిర్మలత్వము, ఇష్టకామ్యార్థసిద్ధి ధనధాన్య లాభములు కలుగును.

జనవరి 2023: ధైర్య సాహసాలు ప్రదర్శించి అత్యున్నతమైన అవార్డులను గెలుచుకుంటారు. అలాగే క్రీడల్లోనూ రాణిస్తారు. శరీరసౌష్ఠవము కలిగి చూపరులను ఆకర్షిస్తారు. ఉద్యోగప్రాప్తి, స్థానచలనము సంభవిస్తుంది.

ఫిబ్రవరి: సమస్త ఐశ్వర్యములు కల్గును. సమాజంలో మీ మాటకు విలువ, మీకు గుర్తింపు వస్తుంది. మీ వ్యవహార ధోరణి మంచిది. ఇతరులను దయతో ప్రేమతో చూడడం వలన ఇది మీకు సాధ్యమవుతుంది. స్థిరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది.

మార్చి: శుభకార్య పరంపరలు గృహమున జరుగును. శుభకార్యాలు కలసి వస్తాయి. శుభవ్యయం చేస్తారు. ఆరోగ్య విషయాలు అనుకూలముగా ఉండును. తరచు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

** ** **