ముక్కు ద్వారా కరోనా టీకా..
భారత్ బయోటెక్ డెవలప్… మరింత బూస్టర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరోనా వైరస్‌కు టీకానే శ్రీరామరక్ష.. ఫస్ట్, సెకండ్ డోసు తీసుకోవాలి. లేదంటే జాన్సన్ ఒక డోసు తీసుకున్న సరిపోతుంది. బూస్టర్ డోస్ అని కూడా ప్రతిపాదన వస్తోంది. కానీ దీనిపై స్పష్టత లేదు. అయితే ముక్కు/ గొంతులో వైరస్ ఉంటుంది. ఇప్పటివరకు టీకాలు ఇచ్చారు కదా.. దానిని ముక్కు ద్వారా వేసే టీకాలపై నిపుణులు పరిశీలిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ముక్కు ద్వారా వేసే కరోనా టీకాలు రానున్నాయి. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ అందరికంటే ముందు నిలిచింది. ప్రపంచంలో తొలిసారిగా ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. తొలిదశలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు.ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.