ముదురుతున్న జల వివాదం
🔹రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు .. ప్రాజెక్ట్ ల వద్ద భద్రత
🔹జూరాల బ్రిడ్జ్ పై రాకపోకలు బంద్..
🔹నాగార్జున సాగర్ లో ఏపీ అధికారుల అడ్డగింత
🔹వినతి పత్రం ఇవ్వటానికి తెలంగాణ జెన్కో లోకి వెళ్ళే యత్నం.. నో అన్న పోలీసులు
🔹పులిచింతల ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ ఉత్పత్తి నిలిపివెయ్యాలని ఎస్ సి విజ్ఞప్తి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జలవివాదం ఇప్పుడు పవర్ పంచాయతీ గా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల వద్ద పరిస్థితి టెన్షన్ కలిగిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ప్లాంట్ ల వద్దకు ఉద్యోగులు తప్ప ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తే, తాజాగా ఏపీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ పోలీసులు సైతం ప్రాజెక్ట్ ల వద్ద భారీగా మోహరించారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాజోలఇప్పటికే ఏపీ పోలీసులు సైతం ప్రాజెక్ట్ ల వద్ద భారీగా మోహరించారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ విధిస్తామని ఎవరూ అక్కడికి వెళ్లొద్దని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ విధిస్తామని ఎవరూ అక్కడికి వెళ్లొద్దని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
మరోవైపు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్ , పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఇరువైపులా మోహరించి పహారా కాస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు వంతెనపై తెలంగాణ పోలీసులు రాకపోకలు నిషేధించడంతో గద్వాల , ఆత్మకూరు, మక్తల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ లో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులను తెలంగాణ పోలీసులు తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇవ్వడానికి జెన్ కో లోనికి అనుమతించలేదు. సాగర్ లో తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన అధికారులను నూతన వంతెన వద్ద అడ్డుకున్న పోలీసులు వెనక్కి పంపారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటే, మరోపక్క తెలంగాణ అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేసే తీరుతామంటున్నారు. ఇదిలా ఉంటే ప్రోటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టు లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఎస్సీ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తికి , నీటి కేటాయింపులకు ప్రోటోకాల్ ఉంటుందని పేర్కొన్న ఆయన ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, కానీ తెలంగాణ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ లోని సాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత విద్యుదుత్పత్తిని చేసుకోవాలని ఆయన అంటున్నారు. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుండగా,ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తిని ఆపేది లేదని తెలంగాణ మొండిగా ముందుకు వెళుతుంది. మరి తాజా పరిణామాలు ముందు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులకు కారణం అవుతాయో వేచి చూడాలి.