మేషం (Aries) 2022-2023

మేషం (Aries) 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Aries/Mesha/మేషరాశి 

(అశ్విని: 1,2,3,4 పాదములు, భరణి: 12,3,4 పాదములు, కృత్తిక 1వ పాదము)

 (ఆదాయం – 14  వ్యయం – 14    రాజపూజ్యం – ౦౩  అవమానం – 06)

ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి వ్యయ స్థానమందు సువర్ణమూర్తి సర్వ సౌఖ్యములను కలుగజేయును. శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి ఏకాదశ స్థానమందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. 

రాహు కేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా జన్మ, సప్తమ స్థానములందు రజితమూర్తులుగా సంచరింతురు. చురుకైన స్వభావంతో, అవిశ్రాంతంగా ఎప్పుడూ వైవిధ్యంతో ఏదో చేయాలని తపనపడుతూ ఉంటారు. బృహస్పతి మీనరాశిలోనికి రావడం, మీలోని చీకటికోణాన్ని అధిగమించడానికి ఉపకరిస్తుంది. మీ అలవాట్లలో మంచి మార్పు వస్తుంది. ఈ రాశి వార్కి సంవత్సరారంభమున గురుడు వ్యయస్థానమందు శని లాభస్థానమందు శుభప్రదులై తలచినంతలో అన్ని పనులు నిరాటంకముగా సాగును. దేహారోగ్యము, ద్రవ్య లాభములు, స్త్రీ, పుత్రుల వలన విశేషసుఖము, దూరప్రాంతములో యున్న సంతానము గురించి మంచి వార్తలు వినుట, మనస్సు ప్రశాంతముగా ఉండి నిర్మలత్వము పొందుట ఇవి జరుగును.

ధనలాభము, గృహమున కళ్యాణాది శుభయోగములు, భూగృహ స్థిరాస్తుల వలన ఆదాయము, శత్రునాశనము, తలచిన కార్యములన్నియు జయప్రదమగుట, కార్యసిద్ధి కల్గును. శరీర సౌష్టవము, శరీర ఆరోగ్యము, ముఖవర్చస్సు కల్గును. శుభకార్యములు చేయుట వలన ధన వ్యయము, మంత్రసిద్ధి కల్గును. ఉద్యోగస్తులకు వ్యాపారులకు అనుకూలముగా యుండును. వైద్య విద్యార్థులు అత్యంత ప్రతిభను చూపించి విద్యలలో రాణిస్తారు. వైద్యవృత్తిలోనివారు నిరంతరం కృషితో పేరు ప్రఖ్యాతులు విశేష గౌరవము, ధనము సంపాదిస్తారు. న్యాయవాదులు విజయం సాధిస్తారు. గతకాలం నుండి అపరిష్ఫృతముగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. కళాకారులకు, సినీ రంగములోని వారికి ఈ సంవత్సరం మొదటి మూడు మాసములలో అత్యంత ఆదరణ ధన సంపాదన పూర్వపు వైభవము కల్గుతాయి. సాంకేతిక రంగములో పనిచేసే పరిశోధకులకు కృషికి తగిన ఫలితము, తదుపరి గుర్తింపు వస్తుంది.

Know More Aries/Mesha/మేషరాశి

ఈ రాశివారికి శని ప్రభావము వలన ఫలితములు సంవత్సరారంభములో పైవిధముగా యుండగా, జూలై 2 నుండి దశమ శని ప్రభావముచే దారా పుత్రులతో విరోధము ఆరోగ్య లోపములు కల్గును. చేయు వృత్తి యందు మనస్సును కేంద్రీకరించక వృధాగా కాలయాపనలు జరుగును. జన్మరాశి యందు రాహువు సంచారము యోగప్రదము కాదు. అందరితోనూ వివాదములు, శ్మశాన సందర్శనములు, ముఖము కళ తప్పుట, చెడు స్నేహముల వలన ధన వ్యయము, ఆరోగ్యలోపము లేర్పడుట, మొదలగు ఫలితములున్నను రాహువు మూర్తివంతముచే క్రమేపీ మంచి ఫలముల నొసగును. కుటుంబమునకు విడిగా యుండి దూర ప్రాంతములందు నివసించవలసి వచ్చుట జరుగును. సంవత్సరారంభంలోనే విద్యార్థులు ఉద్యోగ నియామకాల్లో ఎంపిక అవుతారు. ఉన్నత విద్యలకై ఇతరదేశ ప్రయాణాలు కలసి వస్తాయి.

శ్విని నక్షత్రమువారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో కార్యోన్ముఖులై విజయం సాధిస్తారు. భరణి, కృత్తికల వారికి సంవత్సరమంతా శుభఫలములు, వజ్రము, కెంపు ధరించుట.

శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామస్తోత్ర పారాయణ చేయుట యోగకరము. 

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ‘9’. 1,2,3,6  తేదీల సంఖ్యలు – ఆది, బుధ, గురు వారములు కలసిన మంచిది. 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: అనుకున్న సమయంలో, ప్రయత్నం మిమ్ములను విజయపు అంచులవైపు తీసుకుని వెళ్తుంది. చిన్న విషయాలలో కూడా అసాధారణ ప్రజ్ఞ కనబరుస్తారు. క్రోధాన్ని వీడి సంరయమనం ప్రదర్శిస్తే నాయకత్వం లభిస్తుంది. 

మే: ఆర్ధిక లావాదేవీలు స్తంభిస్తాయి. చోరభయం, ప్రయాణములలో జాగ్రత్త అవసరం. కృషి మందగిస్తుంది. మంచివారితో స్నేహము, ఆరోగ్యము, మణులు, అలంకార వస్తువులప్రాప్తి, అమోఘమైన వాగ్దాటి ప్రదర్శించి కార్యజయం పొందుతారు. 

జూన్‌: ప్రయత్నించిన కార్యజయం. ధనలాభము, మనస్పౌఖ్యము, ప్రీ సంగమము, ఆకస్మికంగా ధనము అధికంగా ఖర్చు అవుతుంది,చుట్టములతో ద్వేషము, శరీరమున త్రిప్పట, దేశదిమ్మరితనము వృధా కాలయాపన జరుగుతుంది. 

జులై: దూరప్రయాణాలు కలసి వస్తాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము, కుమారుల వలన సౌఖ్యము,దేహములో సమస్యలు తొలగి ఆరోగ్యము కల్గును. ధైర్యము, ప్రణాళిక, ఆచరణ, విజయం ఇవి మీ స్వంతం.

ఆగష్టు: విద్యార్థులకు వైద్యవిద్యల్లాంటి అసమాన ప్రతిభ చూపవల్సిన చదువులలో అవకాశం. సాంఘిక కార్యక్రమాల్లో విజయం,గృహవాతావరణం పెద్దగా అనుకూలం గాదు. రచనా వ్యాసంగాల్లో ప్రతిభ చూపించి అందర్నీ ఆకట్టుకుంటారు. 

సెప్టెంబర్‌: ఇతరుల శ్రమను తేలికగా తీసుకొనుట మంచిదికాదు. ఇతరులతో పరుషపదజాలం మానుట మంచిది, విద్యచే వినోదపడుట, ధనధాన్యాది వస్త్ర లాభములు, వక్తృత్వపుపోటీలలో రాణిస్తారు. కార్యజయము సుఖము కల్గును. 

అక్టోబర్‌: ధైర్యము, చాకచక్యము చూపించి ప్రయత్నించిన కార్యములలో జయం, ఆకస్మికముగా అదృష్టం మిమ్ములను వరిస్తుంది. దూరప్రాంతాలలో చదువులకు మార్గం సుగమమవుతుంది. ఉన్నత విద్యలకు శ్రీకారం చుడతారు. 

నవంబర్‌: ఇతరులకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు. విందు వినోదాలు కలసివస్తాయి. దైవారాధనలో, సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. గృహమున కళ్యాణశోభ కల్గుతుంది. కుటుంబపెద్దల మన్ననలు కల్గును. 

డిసెంబర్‌: దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తారు. న్యాయమైన సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. గతములో భీమాసంస్థలలో పెట్టుబడుల వలన ధనము వస్తుంది. నిర్మాణాల్లో స్తంభన జాప్యం. 

జనవరి 2023: నాయకత్వ మరియు పోరాటపటిమను ప్రదర్శించి చాకచక్యంతో పనులను చక్కబెట్టుకుంటారు. సంతానం విషయంలో ఆనందం. భూగృహ స్థిరాస్తుల మార్పులు మీకు అనుకూలము. ఆస్తి తగాదాలకు పరిష్కారం. 

ఫిబ్రవరి: ఈ రాశివార్కి వాక్‌ స్థానమందు కుజ స్తంభన వలన సంభాషించునపుడు ఇతరులపై విరుచుకు పడితే ప్రయోజనం ఉండదు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ధనాదాయంతో బాటు పెట్టుబడులు కూడా పెరుగును. 

మార్చి: సమస్త దోషాలు తొలగి సకలైశ్వర్యాలు కల్గుతాయి. గృహమున ఆనందకరమగు వాతావరణం ఉంటుంది. ధనధాన్యాలు కల్గుతాయి. గృహమున కళ్యాణాది శుభ శోభ వెల్లివిరుస్తుంది. ఆనందమయమగు జీవనం,చిత్ర వస్త్రాలాభం.

** ** **