రద్దయిన చట్టం కింద కేసులు..
> రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు కావడంపై సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్ జనరల్‌ను కూడా ఆ నోటీసుల్లో భాగం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ‘న్యాయపరంగా ఈ అంశాన్ని విడిగా పరిశీలిస్తాం. అలాగే ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నాం’ అంటూ సుప్రీం వెల్లడించింది.
ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లోనే సుప్రీం తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీచేసింది. అయినా, పలు చోట్ల పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. విచారణలో భాగంగా ఇది చాలా దారుణమైన పరిణామమని వ్యాఖ్యానిస్తూ.. సుప్రీం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ రద్దయిన చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని అన్ని రాష్ట్రాలకు ఇటీవలే కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసింది.

Related posts:
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. నెరవేరిన భారత్ 100 వందేళ్ల కల
ఇక ఇంటింటికీ ‘దిశ’
Majlis Kotanu BJP Baddalu Kodutunda.?
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
మోకాలి నొప్పితోనే.. కాంస్యం గెలిచిన కుస్తీవీరుడు
యువతకు వైఎస్ జగన్ పెద్ద పీట
సీఎం జగన్ నిర్ణయాలతో కరోనా కట్టడిలో సత్ఫలితాలు
ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించడం మా కల