రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ
🔹ఆసక్తికర పరిణామం..
🔹అసలేం జరుగుతోంది ?
వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు యూపీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పీకే సమావేశమయ్యారు. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీకి సలహాలు ఇస్తున్నారా ? అనే చర్చ కూడా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పీకే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలో కీలక భూమిక పోషించారు. అయితే గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే పాచికలు పారలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేతలతో పీకే సమావేశం మూడో ఫ్రంట్ కోసం జరిగిందా లేక యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం జరిగిందా ? అన్నది చూడాలి.