tjss1

 

రూ. 25 లక్షలు ఇవ్వాల్సిందే – అనంచిన్ని

 

🔹కరోన బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి
🔹జర్నలిస్టుల సమస్యలపై మౌనదీక్ష
🔹జర్నలిస్టులకు ఉపయోగపడని ప్రెస్ అకాడమీని రద్దు చేయాలి: గౌటి రామకృష్ణ
🔹చలో అంబర్ పేట్ విజయవంతం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరోన కారణంగా మరణించిన ప్రతి  జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని, కరోన బారిన పడిన ప్రతి జర్నలిస్టుకు 5 లక్షలు వెంటనే చెల్లించాలని టిజెఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల క్షేమం కొరకు ‘మౌన దీక్ష-చలో అంబర్ పేట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిదిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా కరోనా కష్టకాలంలో సేవలందించిన  జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ తరుణంలో తక్షణ సహాయం కింద 50 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలంటూ తెలంగాణ జర్నలిస్ట్  సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ కోరారు. అంబర్ పేట గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, జర్నలిస్ట్ సంఘ నేతలు పల్లె రవి, మామిడి సోమయ్య, అమర్, మురహరి బుద్ధారం, తొలివెలుగు జర్నలిస్ట్  రఘు, సంతోష్ ప్రసాద్,బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు, అంబర్ పేట శంకర్ లు పాల్గొన్నారు.

tjss

హాజరైన అతిథులు ముందుగా అంబర్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద  నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరూ మౌన దీక్షకు దిగారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన జర్నలిస్టుల పాత్ర ముఖ్యమని, తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టుల బతుకులు హీనంగా మారాయని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కరోన బాధిత జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని, ఇది ఆరంభం మాత్రమే అని సమస్యలు పరిష్కరించపోతే.. మరో దశ తెలంగాణ ఉద్యమ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్  సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం, ఉపాధ్యక్షుడు సంతోష్, అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జ్  మోర శ్రీరాములు, అంబర్ పేట కార్యదర్శి  మొహమ్మద్ యాసిన్, హెచ్.యు.జే గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ యోగి, జర్నలిస్టులు శీను, ప్రవీణ్, సంతోష్, శ్రీశైలం, సతీష్ ముదిరాజ్, వసీం, హబీబ్, రాంబాబు, రొఫ్, అఖిలపక్ష నాయకులు యశ్వంత్, జమీర్, సమద్, ఫోటోగ్రాఫర్లు, కెమెరా మెన్ లు తదితరులు పాల్గొన్నారు.