విద్యార్థులకు సీఎం జగన్ అద్భుత కానుక
ఏపీలో విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్.. విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకలో 100 శాతం నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. అంతేకాదు మరొకటి కూడా కిట్ లో యాడ్ చేయాలని నిర్ణయించారు.
అమరావతి (ప్రశ్న న్యూస్) సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా చెప్పిన విధంగా వారికి నగదు అందచేస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్న చదువే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక ప్రవేశ పెట్టారు సీఎం జగన్. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు ఇస్తున్నారు. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఇస్తున్నారు. విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్ కిట్లలో వస్తువుల నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47.32 లక్షల మందికి పైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కోసం 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 731.30 కోట్ల రూపాయల వ్యయం చేస్తోంది. విద్యా కానుక ద్వారా విద్యార్థులకు అందచేసే వస్తువులు 100 శాతం నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎమ్, మండల విద్యాశాఖాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించారు.నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, జత బూట్లు, రెండు జతల సాక్సులను రాష్ట్రంలోని 4 వేల 031 స్కూల్ కాంప్లెక్స్‌లకు, యూనిఫాం క్లాత్‌ను 670 మండల రిసోర్సు కేంద్రాలకు సప్లయర్స్ అందజేస్తున్నారు. కిట్లను ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలని ఉన్నతాధికారులు అదేశాలిచ్చారు.
విద్యాకానుకలో ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం అధికారులు సూచించారు. నోటు పుస్తకాలకు సంబంధించి వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా అన్ని రకాల నోటు పుస్తకాలను పరిశీలించాలన్నారు. అన్ని రకాల బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సులు, యూనిఫాం క్లాత్‌ను పరిశీలించాలి. ప్రతి మండల రిసోర్సు కేంద్రం లేదా స్కూల్ కాంప్లెక్సుకు మెటీరియల్ తగినంత అందిందో లేదో సరిచూసుకోవాలి. ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు అందజేసే మెటిరీయల్‌లో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్ లేదా సంచి లేదా ప్యాకెట్‌ను పూర్తిగా పరిశీలించాలి. యూనిఫాం క్లాత్ మండల రిసోర్సు కేంద్రానికి ప్యాకెట్లతో కూడిన బేల్ రూపంలో చేరుతుంది. స్కూల్ కాంప్లెక్స్‌కు అందజేసిన వస్తువుల్లో పాడైనవి, చిరుగులు గుర్తిస్తే మండల విద్యాధికారి దృష్టికి వెంటనే తేవాలి. మండల రిసోర్సు కేంద్రాల్లో వీటిని గుర్తిస్తే జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కి సమాచారం అందించాలి. అలాగే స్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో సర్ది కిట్లుగా ఉంచాలి. మండల రిసోర్సు కేంద్రం నుంచి కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో విద్యార్థులకు వెంటనే కిట్ ను అందించాలి. నోటు పుస్తకాలకు సంబంధించి సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా సరుకు అందుతుందని.. తగినంత సరుకు రాని పక్షంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి అన్నారు. అలాగే అన్ని వివరాలను జగనన్న విద్యాకానుక ’ యాప్‌లో నమోదు చేయాలన్నారు. యూనిఫాంకి సంబంధించి మండల రిసోర్సు కేంద్రానికి తగినంత సరుకు వచ్చిందా లేదా సరిచూసుకోవాలన్నారు. ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుందని, ప్రతి తరగతికి క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది యూనిఫాం బేల్‌లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి అన్నారు.