PrajaPrashna

Telugu Daily Newspaper

వృషభ (Taurus)

Taurus(Vrishabha)

వృషభ (Taurus)

 

కృత్తిక 2,3,4 పా|| రోహిణి 4పా|| మృగశిర 1,23|| :- ఆదాయం – 11 ఖర్చు – 5 పూజ్యత – 1 అవమానం – 3

 

గురుడు: ఈ సంవత్సరమంతయు దశమమందు సంచరించును. శని: ఈసంవత్సరమంతయు భాగ్యమందు సంచరించును. రాహు, కేతువులు: సంవత్సారాది నుండి రాహువు జన్మమందు, కేతువు సప్తమమందు సంచరించును.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. గ్రహబలము చాలా తక్కువగా ఉన్నది. శుభఫలితములు కంటే పాపస్థాన ఫలితములు ఎక్కువగా అనుభవించ వలసి వచ్చును. అధికముగా శ్రమించిన గాని ఫలితము రాకుండుట, ధనాదాయం తగ్గుట, ఉద్యోగంలో చిక్కులు, ఉద్యోగ గండం లేదా సహోద్యోగుల ముందు పై అధికారుల వలన నిందలు పొందుట, అవమానము, అగౌరవము కలుగును. స్థాన చలనము కలుగును, వృధా ప్రయాణములు,ఋణము చేసి స్థిరాస్తి మరియు వాహనము కొనుగోలు చేయుట, మేహపీడ, శరీర అనారోగ్యం, శూల బాధ కలుగును. కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చుట, ఆర్థిక ఇబ్బందులు, వైరాగ్యభావనలు కలుగుచుండును, స్నేహితులు, బంధువర్గంతో విభేదాలు, శరీరమందు బలహీనత, భార్యతోకలహములు కలుగుచుండును. ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా ఉండుటవలన ఋణము చేయవలసి వచ్చును, వివాహ ప్రయత్నములు నెరవేరుట | కష్టము. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఆదాయంకన్నా నష్టం ఎక్కువగా ఉండును, న్యాయవాదులకు విజయము లభించును, ధనాదాయం బాగుండును. రాజకీయ నాయకులకు ప్రజలలో వ్యతిరేకత, అవమానములు, పోలీస్ కేసులు, నిందలు ఎక్కువగా ఉండును. పాడి పరిశ్రమ వారికి లాభదాయకంగా ఉండును. మత్స్య, పౌల్డీ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితము కలుగును. విద్యార్థులకు ఈ సంవత్సరం ఉత్తీర్ణత తక్కువగా ఉండును. సినీరంగం వారికి లాభదాయకంగా ఉండును. వ్యవసాయదారులకు రెండు పంటలు మధ్యమముగా ఉండును.

ఈ సంవత్సరం గోచారరీత్యా బలహీనంగా ఉండటం వలన దైవారాధన చేయుట వలన శుభఫలితములు పొందవచ్చు. రుద్రాభిషేకము, కాలభైరవ దర్శనం, దుర్గ దర్శనం, చండీ పారాయణ చేయుటవలన ఆరోగ్యము ధనాభివృద్ధి కలుగును.

చైత్రమాసం (13th April to 11th May) : ఈ మాసంలో ఉత్తమమైన పనులు చేయటం వలన కీర్తిని పొందుదురు, నూతన ఆదాయ మార్గాల ద్వారా సంపదలు | పొందుతారు. అనారోగ్యం నుండి ఉపశాంతి లభించును, గృహ లాభం, వాహన లాభం కలుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : ఈ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. సమస్యలన్నీ ఒక్కసారి మీద పడినట్లు కనపడను. మనోధైర్యము చేత సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయుదురు. మిత్రుల సహాయము లభించును. దైవారాధన చేయుటవలన మనోధైర్యము కలుగును.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : ఈమాసము గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. కేవలం శుక్రగ్రహ బలం మాత్రమే ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఋణములు చేయవలసి వచ్చును. దైవారాధన చేయుట ఉత్తమం.

ఆషాడ మాసం (11th July to 8th August) : ఈ మాసంలో కొంతమెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. కొంత ఊరట లభిస్తుంది. మానసిక ధైర్యంతో ఉత్సాహంతో పని చేయుట, కొద్దిపాటి ధనలాభము కలుగును.

శ్రావణ మాసము (9th August to 7th September) : గురువుల అనుగ్రహం, గొప్ప వారి యొక్క సహాయసహకారాలు కొరకు ప్రయత్నించుట, నూతన పరిచయాలు, కుటుంబం కొరకు శ్రమించుట జరుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఈ మాసం గ్రహస్థితి అనుకూలంగా లేదు. మానసిక ఇబ్బందులు, ఆర్థికపరమైన చిక్కులు, ఋణములు చేయవలసిన వచ్చుట, దుఃఖము కలిగించును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : ఈ మాసము కొంతవరకు సమస్యల నుండి బయట పడుటకు మార్గములు కనబడును, మిత్రుల సహాయ | సహకారములు వలన ఇబ్బందులు తొలగును. అధిక శ్రమ చేత కార్యము సాధించ గలరు.

కార్తీకమాసము (5th November to 4th December) : గృహమునందు శుభకార్యములు జరుగుట, నూతన ఉత్సాహం, బంధుమిత్రుల సమాగమం, ధనాదాయం కలుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22) : ఈ మాసము దైవారాధనలు చేయుట, దానధర్మములు చేయుట, నూతన వస్త్రములు, వాహన,గృహ లాభము కలుగును. ఆలయ దర్శనములు చేయుదురు.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : ఈ మాసము గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. మౌనంగా ఉండుట వలన మేలు చేకూరును. దైవారాధన దానధర్మములు చేయుటవలన సమస్యల నుండి ఉపశాంతి లభించును.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : ఈ మాసమునందు కేవలం శుక్రబలం మాత్రమే ఉన్నది. ఋణములు చేసి గృహ సంబంధమైన పనులు చేయించుట, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, బంధుమిత్రులతో కలహము, మానసిక అశాంతి కలుగును.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : ఈ మాసంలో శుభకార్యములు చేయుట, గృహమునందు మంగళ తోరణములు కట్టుట, ఋణములు చేయుట, చక్కని ఆదాయము, అనారోగ్యం నుండి ఉపశాంతి, ధైర్యము, లాభము కలుగును.