Nirmala

 

వైద్య రంగానికి 50 వేల కోట్లు

 

🔹భారీగా ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన నిర్మలా సీతారామన్
🔹పర్యాటక రంగానికి ఉపశమనం కలిగించే నిర్ణయాలు
🔹క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్స్
🔹మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కరోనా మహమ్మారి దేశాన్ని ఆర్థికంగా తీవ్రంగా నష్ట పరిచిన నేపథ్యంలో పలు ఆర్థిక ఉపశమన చర్యలను ప్రకటించారు. ఈ క్రమంలో కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణకు 50,000 కోట్లు ప్రకటించిన నిర్మల సీతారామన్, దేశ ఆర్థిక అభివృద్ధి ని పెంచడానికి ఉద్దేశించిన 8 కొత్త ఆర్థిక ఉపశమన చర్యలను వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కరోనా మహమ్మారి దేశాన్ని ఆర్థికంగా తీవ్రంగా నష్ట పరిచిన నేపథ్యంలో పలు ఆర్థిక ఉపశమన చర్యలను ప్రకటించారు. ఈ క్రమంలో కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణకు 50,000 కోట్లు ప్రకటించిన నిర్మల సీతారామన్, దేశ ఆర్థిక అభివృద్ధి ని పెంచడానికి ఉద్దేశించిన 8 కొత్త ఆర్థిక ఉపశమన చర్యలను వెల్లడించారు.

వైద్య ఆరోగ్య రంగానికి సేవలను అందించే సంస్థలకు తాము చేయూతనిస్తామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకుంటామని వెల్లడించిన నిర్మల సీతారామన్ ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం చేస్తామని, ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని జూన్ 30 2021 నుండి మార్చి 31 2022 వరకు పొడిగించామని వెల్లడించారు. వైద్య మౌలిక వసతుల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. టైర్ టూ త్రీ పట్టణాల పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. పిల్లలపై దృష్టి సారించి ప్రజారోగ్యం కోసం రూ .23,220 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. 11,000 మందికి పైగా పర్యాటక గైడ్లు, పర్యాటక వాటాదారులకు 100 శాతం హామీ కింద, కొన్ని పరిమితుల్లో రుణాలు ఇస్తామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం కోసం వీసా జారీ పునః ప్రారంభించిన తర్వాత, మొదటి 5 లక్షల పర్యాటక వీసాలు ఉచితంగా ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.ఇక ఇతర రంగాలకు 60 వేల కోట్ల లోన్ గ్యారెంటీ ఇస్తామని వెల్లడించిన సీతారామన్, వడ్డీ రేటు 8.25 శాతం గా ఉండబోతోందని వెల్లడించారు.
ఇదే సమయంలో అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం యొక్క పరిధిని ప్రభుత్వం విస్తరిస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 3 లక్షల కోట్ల కార్పస్‌కు మరో 1.5 లక్షల కోట్లు చేరుస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాల కోసం కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని సీతారామన్ ప్రకటించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు కల్పించడానికి క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించిన ఆమె ఇది పూర్తిగా కొత్త పథకమని నిర్మల సీతారామన్ వెల్లడించారు. కొత్త రుణాలపై దృష్టి పెట్టామని నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.