సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో రేవంత్ రెడ్డి పాగా..
రెండు రోజుల దీక్ష..అందుకేనా..?
టీపిసిసి అధ్యక్షుడు పార్టీ పటిష్టత కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు..అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు..ఈనేపథ్యంలోనే సీఎం కేసిఆర్ దత్తత గ్రామంలో ఆయన రెండు రోజుల పాటు నిరహార దీక్ష చేపట్టనున్నారు.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అధికార టీఆర్ఎస్‌కు ఫుల్ స్టాప్ పెట్టి… రానున్న రెండు సంవత్సరాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు..ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిలపై ఆయన దృష్టిసారించారు..ఇందుకు అనుగుణంగా సీఎం కేసిఆర్ దత్తత గ్రామాల పేరు మీద చేస్తున్న రాజకీయ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టెందుకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు..కాగా ఇటివల వాసాల మర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే..ఆ ఊరిని అన్ని విధాల అభివృద్ది పరిచేందుకు ఆయన గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ముందుగా దళిత బంధును హుజూరాబాద్‌లో ప్రారంభించాలని భావించినా..తొలిసారి వాసాలమర్రి దళితులకు అందించారు. గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు పదిలక్షల రూపాయలు విడుదల చేశారు. అయితే అంతకు ముందు సీఎం కేసిఆర్ మల్కజ్‌గిరి మెడ్చల్ జిల్లాలోని మూడు గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నారు.వాటిలో మూడు చింతలపల్లి గ్రామం, లక్ష్మాపూర్‌తోపాటు కేశవరం గ్రామాలు ఉన్నాయి..ఆయన ఎర్రవెల్లి ఫాం హౌజ్‌కు వెళ్లే దారిలో అవి ఉండగా వాటి అభివృద్ది అంతంత మాత్రంగానే కొనసాగుతోంది..దీంతో ఆ గ్రామాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది..గత కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న గ్రామాల రూపు రేఖలే ఇంకా మరాని నేపథ్యంలో ఆయన దళిత బంధు లాంటీ హామిలతో పాటు ఇతర దత్తత గ్రామాల అభివృద్దిపై చర్చను లేవనెత్తనున్నారు. ఇందుకోసం మూడు చింతల పల్లి గ్రామంలో 24 నుండి రెండు రోజుల పాటు దీక్ష చేసేందుకు సిద్దమయ్యారు.. పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు..రెండు రోజుల పాటు దీక్షలో ఆ ప్రాంతంతో పాగ వేయడంతోపాటు తన పార్లమెంట్ నియోజకర్గంలోకి ఈ గ్రామాలు కూడా కవాడంతో సొంత ప్రయోజనాలు కూడా నెరవేరనున్నాయి… కాగా ఇంతకుముందే సీఎం దళిత బంధును తీసుకురావడంతో రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోర పేరిట గిరిజనులకు సైతం పదిలక్షలు ఇవ్వాలనే డిమాండ్‌ను లేవనెత్తడంతో గిరిజనుల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు..ఇలా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఏకం చేసి అనంతరం రాజ్యాధికారం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.