సీఎం వైఎస్ జగన్‌కు సమన్లను జారీ చేసిన సీబీఐ, ఈడీ కోర్టులు
విచారణకు హాజరయ్యే తేదీ ఫిక్స్
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విచారణను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉంటోన్నారు. ఆయా న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుంటూ బెయిల్ మీద కొనసాగుతున్నారు. తాజాగా ఆయన న్యాయస్థానాల్లో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. దీనికి కారణం- ఆస్తుల వ్యవహరంలో విచారణ జరుపుతోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాలు ఆయనకు తాజాగా సమన్లను జారీ చేశాయి. మొత్తం 10 మందికి సమన్లు జారీ అయ్యాయి. వారితో పాటు 12 సంస్థలకు సైతం సమన్లు ఇచ్చాయి సీబీఐ, ఈడీ న్యాయస్థానాలు. సెప్టెంబర్ 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించాయి. వాన్‌పిక్‌లో భూ సేకరణ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇదే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ న్యాయస్థానాలు సమన్లను జారీ చేశాయి. మాజీమంత్రి శాసన సభ్యుడు ధర్మాన ప్రసాదరావు, అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి పేర్లను కూడా ఈడీ తన పిటీషన్‌లో పొందుపరచింది. దీనితో వారిద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. మ్యాట్రిక్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్‌కు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది. మున్సిపల్ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్, రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌కు సమన్లను ఇచ్చాయి సీీబీఐ, ఈడీ న్యాయస్థానాలు. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి రెడ్డి ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తోన్న జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు ఇచ్చింది. వారందరూ వచ్చేనెల 22వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ గతంలో 16 నెలల పాటు కారాగారంలో ఉన్నారు. విచారణను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ, ప్రస్తుత మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి పేర్లను న్యాయస్థానం కొట్టివేసింది.
Related posts:
నిరుద్యోగుల కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్
జగన్, సాయిరెడ్డి బెయిళ్లపై ట్విస్ట్
Revanth Trishula Vyuham
మల్లారెడ్డి చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి
రాష్ట్ర రాజకీయలనే మార్చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక
వైఫల్యాన్ని ఒప్పుకున్నా" ముఖ్యమంత్రి కేసీఆర్"
రాష్ట్ర హక్కుల కోసం ఎందాకైనా వెళ్తా - సీఎం జగన్
బీజేపీని అడ్డుకోవడం కేసీఆర్ జేజమ్మ నుంచి కూడా కాదు