హుజురాబాద్‌పై గులాబీ బాస్ నజర్
🔹రంగంలోకి గంగుల కమలాకర్
🔹రూ.35 కోట్లు మంజూరు
🔹ఈటలపై గంగుల ఫైర్
హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. ఇక్కడి నుంచి మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. అందివచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. హుజురాబాద్ పట్టణ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేసి ముందడుగు వేసింది. హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 10 కోట్ల 52 లక్షలు, వార్డుల అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పట్టణంలో 35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఎన్నికోళ్లు అమ్మితే స్పేషల్ ప్లైట్ వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బుధవారం హుజురాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈటెల రాజేంధర్ హుజురాబాద్‌కు చేసిన మోసాలను ఎండగట్టారు. హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ మెట్లకింద పాతిపెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి సంపద పెంచుకొని, పేదల భూములు లాక్కున్నాడు మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికొదిలేసాడని.. కనీసం రాష్ట్రమంతా వస్తున్న భగీరథ నీటిని కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోయాడని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మెత్తం అభివ్రుద్ది పథంలో దూసుకుపోతుంటే, పార్టీని చీల్చే కుట్రలు, పన్నాగాలు పన్నుతూ హుజురాబాద్‌ను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇకనుంచి హుజురాబాద్‌ను కరీంనగర్‌కు ధీటుగా అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానని గంగుల తెలిపారు. సమైక్య పాలనలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజల ఆయుదం కేసీఆర్, టీఆర్ఎస్ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. గత అరవై ఏళ్లుగా పాలించిన పాలకులు ఏనాడు తెలంగాణ సంక్షేమం కోసం ఆలోచించలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రపంచమంతా కరోనా కల్లోలంతో అల్లాడుతున్నా రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని గుర్తుచేశారు.
ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్‌కు అందజేశారు. అక్కడ ఆమోదం పొంది.. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు వెళుతుంది. అక్కడ కూడా ఓకే అయితే.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. ఆ నాటి నుంచి అభివృద్ది పనులకు బ్రేక్ పడుతుంది. కానీ ఎన్నికల నిర్వహణ అనేది ఈసీ నిర్ణయించాల్సి ఉంది. ఆ లోపు పనులు జరిగితే హుజురాబాద్ ప్రజలకు మేలు జరిగినట్టే అవుతుంది. గత కొంతకాలం నుంచి కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు పొడచూపాయి. అయినా కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల భూముల ఆక్రమణ అంశం తెరపైకి వచ్చింది. ఆ వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించారు కూడా.. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. బీజేపీలో చేరారు. ఆయనతోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా బీజేపీలో చేరారు. దేశానికే ఆదర్శంగా 24 గంటల కరెంట్, రైతులకు రైతుబందు, రైతుబీమా, ఉచిత కరెంటు, బడుగు బలహీన వర్గాలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి అధ్బుతమైన పథకాలను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి, సతీష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.