హుజురాబాద్‌లో… ఈటల బీటలు వారుతున్నాయ్ – గంగుల కమలాకర్
హుజురాబాద్‌లో బీజేపి బీటలు వారుతున్నాయని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. జమ్మికుంటలో బీజేపి కౌన్సిలర్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రిగంగుల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్దే ద్యేయంగా సీఎం కేసిఆర్ పరిపాలన కొనసాగుతుందని అన్నారు.
హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. స్థానిక నేతలను తమ పార్టీవైపు కు తిప్పుకుని బీజేపికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈనేపథ్యంలోనే మంత్రులు కొప్పులు ఈశ్వర్, గంగుల కమాలాకర్‌లు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. దీంతో పార్టీ చేరికలు ఉపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మికుంట మున్సిపాలిటి కౌన్సిలర్ ప్రణిత దిలిప్‌తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్‌లో ఆహ్వానించారు.ఈ సంధర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తారని, దానికి నిదర్శనమే కరీంనగర్ అని అన్నారు. కరీంనగర్ అభివ్రుద్దికోసం కేసీఆర్ గారు అత్యధిక నిధులు కేటాయించడంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయన్నారు. తెలంగాణపై సీఎం కేసిఆర్‌కు ఉన్న చిత్తశుద్దే అభివృద్దికి కారణమన్నారు. గత ఏడేళ్లుగా ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ వంటి కీలక శాఖల మంత్రి ఉన్న ఈటల రాజేందర్ జమ్మికుంట అభివృద్దికి ఎందుకు నిధులు అడగలేదని ప్రశ్నించారు, ఆయనకు కేవలం తన సొంత ప్రయోజనాలే కానీ నియోజకవర్గ అభివ్రుద్దిపై చిత్తశుద్ది లేదని ఎద్దేవా చేసారు. , ఓట్లేసిన ప్రజల రుణం తీర్చే కనీస ప్రయత్నం కూడా చేయలేదని, హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలనే తపన లేనే లేదని దుయ్యబట్టారు.
అందుకే.. హుజురాబాద్ తో పాటు జమ్మికుంటను అభివృద్దిలేమితో అస్తవ్యస్థంగా ఉందని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 30 కోట్ల రూపాయల నిధుల్ని ఒకే విడతలో జమ్మికుంటకు మంజూరు చేయడమే కాకుండా కొద్ది రోజుల్లోనే పనులు మెదలుపెట్టి అత్యంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇన్ని రోజులు ఈటల రాజేందర్ తన సొంత పనుల కోసం మాత్రమే సీఎం కేసీఆర్ని కలిసారని, హుజురాబాద్ అభివ్రుద్ది గురించి సీఎం ఎప్పుడు ప్రశ్నించినా ఏనాడు సమస్యల్ని సీఎంకు చెప్పకుండా ఇక్కడి అవసరాల గురించి అడగలేదన్నారు. అలాంటి వ్యక్తి మల్లీ ఉపఎన్నికల్లో నిలబడుతున్నాడని, కాని ఆయనకు గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలుసని అందుకే మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నియోజకవర్గ ప్రజలు నిలుస్తారని, హుజురాబాద్ నియోజకవర్గాన్ని, జమ్మికుంట మున్సిపాలిటీని సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌లకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.